మాట మాట్లాడే ముందు జాగ్రత్త అంటూ హెచ్చరించిన సీనియర్ హీరోయిన్.. ఫోటో వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి భూమిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఒకానొక సమయంలో తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు.

కుటుంబ కథా చిత్రాలలోనూ, లేడీ ఓరియంటెడ్ చిత్రాలలోనూ, ప్రేమ కథ చిత్రాలలోను నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న భూమిక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటిస్తూ.మరోసారి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

మిడిల్ క్లాస్ అబ్బాయి, యూ టర్న్, సవ్యసాచి, రూలర్, పాగల్ లాంటి చిత్రాలలో ప్రత్యేక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తోంది.

ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను భూమిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

"""/" / ఈ ఫోటోలను షేర్ చేస్తూ.మీరు మాట్లాడే ముందు పదాలను చాలా జాగ్రత్తగా ఎంచుకోండి ఆ పదాలను మీ కోసం ఉపయోగించినా ఇతరుల కోసం ఉపయోగించినా అవి తప్పకుండా జరిగి తీరుతాయి కనుక మాట్లాడే ముందు జాగ్రత్త అంటూ హీరోయిన్ అభిమానులను హెచ్చరించింది.

ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తేజ సజ్జా జై హనుమాన్ సినిమాలో ఉంటాడా..?