చేపల బజార్ లో జగపతిబాబు రచ్చ.. కానీ అక్కడ పొరపాటు పడ్డాడుగా?
TeluguStop.com
అన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారానే బయటపడుతున్నాయి.ఎక్కడెక్కడో మూలన జరిగిన విషయాలు కూడా ముందు కనపడుతున్నాయి.
అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు.
ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటారు.అయితే వాటిని కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఫాలోవర్స్ ని కూడా ట్రై చేయమన్నట్లు సలహాలు ఇస్తున్నారు.అయితే తాజాగా సీనియర్ హీరో జగపతిబాబు కూడా చేపల బజార్ కి వెళ్లి ఆ వీడియోని పంచుకున్నాడు.
అయితే ఓ విషయంలో పొరపాటు కూడా పడ్డాడు.ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం """/"/
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు జగపతి బాబు గురించి అందరికి తెలిసిందే.
తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.
చాలా వరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో హీరోగా నటించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.
ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ తన పాత్రలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీగా ఉన్నాడు.
1992లో అసాధ్యులు సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమై.ఆ తర్వాత గాయం, జాబిలమ్మ పెళ్లి, దొంగాట వంటి సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకొని మంచి అభిమానం సంపాదించుకున్నాడు ఇక అప్పటినుంచి వెనుతిరగకుండా వరుస సినిమాలలో నటించాడు.
ఇక మధ్యలో కొన్ని ఏళ్ళు ఇండస్ట్రీకి దూరమైన జగపతిబాబు మళ్లీ రీ ఎంట్రీ తో వయసుకు తగ్గ పాత్రలనే కాకుండా విలన్ పాత్రల్లో కూడా నటించాడు.
"""/"/
ఒక హీరోగానే కాకుండా హీరో హీరోయిన్స్ కు తండ్రిగా, విలన్ పాత్రగా కూడా జగపతి బాబు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారాడు.
విలన్ పాత్రతో కూడా అందర్నీ మెప్పిస్తూ వరుసగా అవే అవకాశాలు అందుకుంటున్నాడు.ఇక ఇప్పటికీ జగపతిబాబు లుక్ ఏం మాత్రం మారలేదు.
ఒకప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.అంతేకాకుండా ఈమధ్య బాగా వర్కౌట్లు కూడా చేస్తున్నాడు.
జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.కొన్ని కొన్ని వీడియోలు షేర్ చేసుకుంటారు.
అప్పుడప్పుడు తను వంట గదిలో చేసే ప్రయోగాలను కూడా వీడియోలు చేస్తూ చూపిస్తాడు.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక వీడియో షేర్ చేసుకున్నాడు.
"""/"/
ఇందులో తను సిడ్నీ చేపల మార్కెట్ కి వెళ్లగా.అక్కడున్న చేపలను వీడియో తీయించి తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
అయితే ఆ వీడియోలో తనతో పాటు మరో వ్యక్తి ఉండగా.జగపతిబాబు సిని చాపల మార్కెట్.
చాపల బజార్ అంటుండగా తనతో వచ్చిన వ్యక్తి సిడ్నీ అండి అని అనగా వెంటనే జగపతిబాబు ఆ సిడ్ని, జపాన్ అంటూ పొరపాటు పడ్డాడు.
అంతే కాకుండా తను పంచుకున్న వీడియో క్యాప్షన్ కి కూడా చెప్పల బజార్ అని పంచుకోగా.
అది చెప్పల బజార్ కాదు చేపల బజార్ అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్18, సోమవారం 2024