వయసు ముదురుతున్నా ముద్దుగుమ్మలు పెళ్లెందుకు చేసుకోవడం లేదో తెలుసా.?
TeluguStop.com
సినిమా పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం.అందం అవకాశం ఉన్నప్పుడే అందినకాడికి అందుకోవాలి.
దొరికినంత దోచుకోవాలి.ఇదే ఫార్ములాతో ముందుకు సాగుతున్నారు పలువురు హీరోయిన్లు.
నార్త్ సౌత్ అనే తేడా లేదు.స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా ముందుకు కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే పలువురు హీరోయిన్లు 40 ఏండ్లు దాటినా.పెళ్లి వైపు మాత్రం కన్నెత్తి చూడ్డం లేదు.
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.ఏవుడ్ అయినా సరే టాప్ హీరోయిన్ స్టేటస్ పొందిన వారు పెళ్లి అంశం రాకుండా కాలం గడుపుతున్నారు.
అసలు ఎందుకు నాలుగు పదుల వయసు వచ్చినా పెళ్లి చేసుకోవట్లేరు అనే విషయంపై సినీ వర్గాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కత్రినా కైఫ్.కియారా అద్వానీ, అనుష్క, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్దే, నయనతార, తమన్నా, తాప్సీ, త్రిషా ఒకరేమిటీ చాలా మంది హీరోయిన్ల వయసు 35 వసంతాలు గడిచింది.
పదేండ్లకు పైగా స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు.ఇప్పటికీ కొందరు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.
అయితే పెళ్లిపై వీరికి ఆసక్తి లేకపోవడానికి మెయిన్ కారణం సహజీవనం అనే మాట వినిపిస్తుంది.
నచ్చిన వారితో నచ్చినంత కాలం ఎంజాయ్ చేయడం.ఇద్దరికీ కుదరదు అన్నప్పుడు దూరం జరగడం కామన్ అయ్యింది.
వీరిలో చాలా మంది ఏండ్లకు ఏండ్లుగా లివింగ్ రిలేషన్షిప్ లో కొనసాగుతున్నారు.దీంతో పాటు మరో కారణం కూడా వీరి పెళ్లికి అడ్డుగా నిలుస్తుందట.
అదేంటంటే.పెళ్లి చేసుకుంటే సినీ ఇండస్ట్రీలో ప్రీడం కోల్పోతామని భావిస్తున్నారట.
అటు వయసు ముదిరిన అవకాశాలు వస్తున్నందున ఎందుకు ఇప్పుడే పెళ్లి అని మరికొందరు అనుకుంటున్నారట.
"""/"/
నిజానికి హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే సినీ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుంది.
అదే జరిగితే గ్లామర్ వరల్డ్ నుంచి ఫేడౌట్ కావాల్సి ఉంటుంది.ఆ తర్వాత తమను పట్టించుకునే వారు ఉండరు.
అందుకే సీక్రెట్ గా ఎంజాయ్ చేస్తూనే బ్యాచిలర్ గా కొనసాగుతున్నారు.లైఫ్ ను జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది ముదురు భామలు.
కడుపు నొప్పి ఇబ్బంది పెడుతుందా.. చిటికెలో తగ్గించే చిట్కాలు ఇవి!