పారదర్శకంగా లోక్ సభ ఎన్నికల నిర్వహణకు చర్యలు…. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్
TeluguStop.com
పోలింగ్ సమయాల్లో వచ్చిన మార్పు పై విస్తృతంగా ప్రచారం కల్పించాలి.అదనపు బ్యాలెట్ యూనిట్ల ఎఫ్.
ఎల్.సి, ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి
100% ప్రతి ఓటరుకు ఓటర్ సమాచార స్లిప్పు పంపిణీ చేయాలి.
పోలింగ్ సిబ్బందికి అవసరమైన మౌలిక వసతుల కల్పించాలి డబ్బు,మధ్యం పంపిణీ జర్గకుండా పక్కా నిఘా ఏర్పాటు సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలి లోక్ సభ ఎన్నికల పోలింగ్ పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ .
రాజన్న సిరిసిల్ల జిల్లా :లోక్ సభ ఎన్నికల విధులను ప్రతి ఒక్కరూ పారదర్శకంగా నిర్వహించాలని, పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిని ఒకే తరహాలో చూడాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు.
గురువారం న్యూ ఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ,సన్నద్ధతపై నిర్వహించిన వీడియో సమావేశంలో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారు లతో కలిసి పాల్గొనగా, సమీకృత జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నిర్వహిస్తున్న సమయంలో మనం పారదర్శకంగా విధులు నిర్వహించాలని, అందరినీ సమానంగా చూడాలని ఎవరి పట్ల పక్షపాతంతో వ్యవహరించడం చేయవద్దని తెలిపారు.
ఎన్నికల విధులు భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పక్కాగా జరగాలని, ఎక్కడ ఏ చిన్న పొరపాటు రాకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
పోటీలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలకు అదనపు బ్యాలెట్ యూనిట్లు చేరుకున్నాయని, ఈవిఎం బ్యాలెట్ యూనిట్ల ఎఫ్.
ఎల్.సి, ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు.
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని, హోమ్ ఓటింగ్ ప్రక్రియను నిబంధనల ప్రకారం మే 8 నాటికి పూర్తి చేయాలని, హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలను పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలను పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలియజేయాలని ఆయన సూచించారు.
లోక్ సభ ఎన్నికల పోలింగ్ కంటే ముందుగానే 100% ఓటర్ సమాచార స్లిప్పులు ప్రతి ఒక్క ఓటర్ కు అందేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రం లొకేషన్ ఓటర్లకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ కేంద్రం వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఆహారం, బాత్ రూం , ఇతర వసతులు కల్పించాలని అన్నారు.
సకాలంలో పోలింగ్ ప్రారంభం కావాలని, పోలింగ్ కంటే ముందు మాకు పోల్ నిర్వహించాలని, పోలింగ్ సిబ్బందికి పూర్తిస్థాయిలో అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.
సెక్టార్ అధికారులు విజయవంతంగా పోలింగ్ నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తారని, ఈవీఎం యంత్రాలు పనిచేయని పక్షంలో నూతన ఈవిఎం యంత్రం ఏర్పాటు చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై సెక్టర్ అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ అందజేయాలని తెలిపారు.
పోలింగ్ రోజున జిల్లా కేంద్రాలలో నిపుణులైన అధికారుల చే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
పోలింగ్ దగ్గరవుతున్న సమయంలో డబ్బు మద్యం వంటి ప్రలోభాలు చూపించు ఓటరులను లోభర్చుకునే ప్రమాదం ఉందని, డబ్బు మద్యం పంపిణీ జరగకుండా పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, సి విజిల్ యాప్ వినియోగం పై ప్రజలు విశిష్ట ప్రచారం కల్పించాలని అన్నారు.
పోలింగ్ సమయాలలో కేంద్ర ఎన్నికల కమిషన్ మార్పులు చేసిందని ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఈ అంశం పై విస్తృత ప్రచారం కల్పించాలని, పోలింగ్ శాతం పెరిగే ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
పోలింగ్ కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచార ప్రక్రియ ఆగిపోతుందని , సైలెన్స్ పీరియడ్ లో ఎటువంటి డబ్బు మద్యం పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలన్స్ బృందాలు, వీడియో సర్వేలెన్స్ బృందాలు, అకౌంటింగ్ బృందాలు , పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ డబ్బు మద్యం పంపిణీ కాకుండా చూడాలని అన్నారు.
లోక్ సభ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, పోలింగ్ నిర్వహణ పట్ల సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 3 లక్షల 20 వేల 341 మంది ఓటర్లకు (67.
76%) ఓటర్ సమాచార స్లిప్పులు పంపిణీ చేశామని, పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లావ్యాప్తంగా మొత్తం 277 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, 197 పోలింగ్ కేంద్రాల బయట సిసి కేమేరాలు ఏర్పాటు చేశామని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే 2457 సిబ్బంది కోసం వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ లో నూతన గ్రంథాలయ భవనం(తాసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ) సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ లో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ,గీతానగర్ లో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేశామని అన్నారు.
744 మంది హోం ఓటింగ్ లో పాల్గోంటున్నారని, మే 3 నుంచి మే 5 వరకు హోం ఓటింగ్ పూర్తి చేసేందుకు 19 బృందాలను ఏర్పాటు చేశామని, హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఎన్నికలలో డబ్బు మద్యం ప్రభావం రాకుండా అప్రమత్తంగా ఎన్నికలలో డబ్బు మద్యం ప్రభావం రాకుండా అప్రమత్తంగా తనిఖీలు నిర్వహిస్తూ నివారణ చర్యలు చేపట్టామని అన్నారు.
సి విజల్, 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, జిల్లాలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
ఈ వీడియో సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, అదనపు కలెక్టర్లు పి.
గౌతమి, కీమ్యా నాయక్ , వేములవాడ అర్.డి.
ఓ.రాజేశ్వర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వీడియో: ఇదెక్కడి పిచ్చి పని.. ఫైర్‌క్రాకర్ బాక్స్‌పై కూర్చోబెట్టి చంపేశారు..?