కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రతీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ట్రై చేస్తున్నారన్నారు.

మోదీ దిగిపోతే రాహుల్ ఎప్పుడు పీఎం అవుతాడా అని చూస్తున్నట్లు చెప్పారు.ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ నుంచి దించమని రేవంత్ అభిమానులు లెటర్లు రాయలేదా అని ప్రశ్నించారు.

ఉత్తమ్ ఫెయిల్ అయ్యాడు.రేవంత్ కు పదవి ఇవ్వమని అడగలేదా అని నిలదీశారు.

రేవంత్ రెడ్డిని దింపమని తాము అడగడం లేదన్న ఆయన ఎన్నికలు రేవంత్ హయాంలోనే జరుగుతాయని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిది కాదు.తన జాగీరు కాదని పేర్కొన్నారు.

ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా పీసీసీ అవుతానని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఎన్టీయార్ కెరియర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందా..?