బీజేడీ సీనియర్ నాయకుడు, పిపిలి ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి(65) కరోనా తో మృతి చెందినట్లు తెలుస్తుంది.
బిజు జనతాదళ్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి కరోనా తో కన్నుమూశారు.
కరోనా బారినపడటంతో సెప్టెంబర్ 14న నుంచి భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది.
ఇటీవల ఆయన కరోనా బారిన పడడం తో గత కొద్దీ రోజులుగా ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రి లోనే చికిత్స పొందుతున్నారు.
అయితే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శుక్రవారం నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం తో ఆదివారం పరిస్థితి మరింత దిగజారి తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది.
దేశంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది.రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
పేద, ధనిక అనే తేడా లేకుండా ఈ వైరస్ అందరికీ సోకుతోంది.ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా.
కొంత మంది మృతి చెందారు.తాజాగా ఈ వైరస్ కు బీజేడీ ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి మృతి చెందారు.
ఒడిశా లోని పిపిలి నియోజకవర్గం నుంచి ప్రదీప్ మహారథి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
పలుమార్లు మంత్రిగానూ పనిచేశారు.ఆయనకు భార్య ప్రతివా మహారథి, కుమారుడు రుద్ర ప్రతాప్ మహారథి, కుమార్తె పల్లవి మహారథి ఉన్నారు.
ఆయన మృతికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపి,ప్రదీప్ మహారథి మృతి బీజేడీకి తీరని లోటని ఆయన అన్నారు.