Senior Actress Lakshmi : రూమ్ కు రమ్మంది.. ఆ తర్వాత చాలా తప్పులు చేసింది.. ప్రముఖ నటి లక్ష్మి మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు!

దక్షిణాది సినీ ప్రేక్షకులకు సీనియర్ నటి లక్ష్మీ( Senior Actress Lakshmi ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్గా నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత సహాయ నటిగా ఎన్నో సినిమాలలో నటించి నేర్పించింది.సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి క్యారెక్టర్ లలో నటించింది.

కాగా ఈమె తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ తనదైన శైలిలో నటించి మెప్పించింది.

అయితే ఆమె నటనతో పాటు తన వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు.

తాజాగా ఆమె మాజీ భర్త, తమిళ నటుడు మోహన్ శర్మ( Mohan Sharma ) షాకింగ్ కామెంట్స్ చేశారు.

లక్ష్మి, మోహన్ శర్మ జంటగా చాలా సినిమాల్లో నటించారు.ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారి 1975లో వివాహం చేసుకున్నారు.

కానీ పెళ్లయిన ఐదేళ్లకే భేదాభిప్రాయాలు రావడంతో 1980లోనే విడిపోయారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లక్ష్మీ మాజీ భర్త( Lakshmi Ex-Husband ) ఆమె తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పెళ్లి చేసుకుంటే జీవితాంతం కుక్కలా నీ వెంటే ఉంటానని తనతో చెప్పిందంటూ మోహన్ శర్మ వెల్లడించారు.

కాగా ఈ సందర్బంగా మోహన్ శర్మ మాట్లాడుతూ.'ఓసారి నేను లక్ష్మి షాప్‍కు వెళ్లామ.

అక్కడ ఒక సెంట్ కొనాలని చెప్పాను.అప్పట్లో దాని ధర రూ.

500.కానీ నా దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో లక్ష్మి నాకు గిఫ్ట్ గా ఇచ్చింది.

"""/" / ఆ తర్వాత జీవితంలోకి ఆహ్వానిస్తే.నీ కుక్కలా ఉంటానని లక్ష్మి నన్ను అడిగింది.

ఆ మాటలకు నేను షాకయ్యాను.ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు.

తొలిసారి ఒక అమ్మాయి తన ప్రేమను వ్యక్తం చేసింది.ఆ సమయంలో లక్ష్మి మాటలను సీరియస్‍గా తీసుకున్నాను.

ఆ తర్వాత కాల్ చేసి తన రూమ్‍కు రమ్మని పిలిచింది.నేను వెంటనే హోటల్‍కు వెళ్లాను.

మనం ఇద్దరం పెళ్లి( Marriage ) చేసుకుందామా అని అడిగింది.ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నానని,పెళ్లి గురించి ఆలోచనే లేదని చెప్పా.

కానీ పెళ్లి చేసుకోవాలని లక్ష్మి అడిగాక నేను ఆమె నుదుటన కుంకుమ పెట్టాను.

తాను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను. """/" / ఆ రాత్రే మేం భార్యభర్తలం అయ్యాము.

ఆ తర్వాత మేం చెన్నైకి వచ్చి లాయర్ ద్వారా మా పెళ్లి విషయాన్ని మీడియాకు తెలియజేశాము అని చెప్పారు మోహన్ శర్మ.

పెళ్లి తర్వాత మాకు కలిసే అవకాశం చాలా తక్కువగా ఉండేది.అయితే లక్ష్మి చాలా తప్పులు చేశారు.

వాటన్నింటి గురించి నేను ఇప్పుడు చెప్పలేను.ఆమె తన జీవితంలోకి మరో వ్యక్తిని రానిచ్చారు.

కూతురు ఐశ్వర్య, లక్ష్మి మధ్య తరచూ గొడవలు కూడా అయ్యేవని ఆయన వెల్లడించారు.

కాగా 1980లో మోహన్‌తో విడాకులు తీసుకున్న లక్ష్మి ఆ తర్వాత దర్శకుడు శివచంద్రన్‍ను పెళ్లి చేసుకున్నారు.

అక్కడ బుకింగ్స్ లో ఆహా అనిపిస్తున్న చరణ్ గేమ్ ఛేంజర్.. ఏం జరిగిందంటే?