Actress Lakshmi : స్టార్ యాక్ట్రెస్ లక్ష్మి డబ్బే ప్రధానమంటూ మాట్లాడిన మాటలు వింటే… !
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ లక్ష్మి( Lakshmi ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈమె తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం సినిమాలో కూడా యాక్ట్ చేసి మెప్పించింది.
ప్రేమంటే ఇదేరా మురారి వంటి సినిమాల్లో హీరోల తల్లి ఆడ్ చేసి మరింత గుర్తింపు తెచ్చుకుంది.
ఈ తార ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కష్టానికి తగిన డబ్బు తీసుకోవడం గురించి మాట్లాడింది.
ఈ ముద్దుగుమ్మ తనకు సినిమాలో పాత్ర ఉందని దర్శకులు అప్రోచ్ అయ్యే వారని చెప్పింది.
కాకపోతే వారు డబ్బులు ఇవ్వకుండా ఉచితంగా నటించమని అడిగేవారట.కెరీర్ తొలినాళ్లలో కూడా ఇలాంటి ఉచిత ఆఫర్లు వస్తే లక్ష్మి నిరాకరించిందట.
ఆమె ప్రకారం సినిమాల్లో నటించడం మామూలు విషయం కాదు.అది కూడా ఒక శ్రమతో కూడుకున్న పనే.
దానికి తగిన డబ్బు ఇవ్వాలని ఆమె చెబుతుంది. """/" /
ఎవరైనా సినిమాలో ఉచితంగా నటించడానికి అడిగినప్పుడు, కష్టపడి నటించడం దానం లేదా ధర్మం కాదని లక్ష్మి చెబుతుంది.
సినిమా ఒక వ్యాపారం అని, ప్రతి ఒక్కరూ తమ కష్టానికి తగిన డబ్బు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడింది.
డబ్బు అందరికీ ఎంత ప్రధానమో వివరంగా చెప్పేందుకు తన సినిమా కెరీర్ లో జరిగిన ఒక సంఘటనను ఉదాహరణగా తెలిపింది.
లక్ష్మి మాట్లాడుతూ గౌతమి( Gouthami ), తాను కలిసి నటించిన ఒక సినిమాలో నటించేటప్పుడు వారికి ఆ సినిమా నిర్మాత భార్య పరిచయమైందట.
ఆమె చాలా సౌమ్యంగా ఉంటూ భర్తను దేవుడుగా భావించేదట. """/" /
అతను తిన్న తర్వాతనే భోం చేసేదట.
ఆ నిర్మాత మాట జవదాటతకుండా సదరు సతీమణి నడుచుకుంటున్న తీరు నచూసి గౌతమీతో సహా లక్ష్మి కూడా ఆశ్చర్య పోయిందట.
ఒకరోజు ఆ నిర్మాత చనిపోతే వారి ఇంటికి గౌతమితో సహా లక్ష్మి కూడా వెళ్ళింది.
భర్తే ప్రాణంగా, దేవుడుగా భావించిన ఆ సతీమణిని ఓదార్చుతూ గౌతమి పక్కనే లక్ష్మి కూర్చుందట.
అప్పుడే ఆ నిర్మాత భర్తను గట్టిగా తిడుతూ కంట్రోల్ తప్పిందట."ఈ సచ్చినోడు, నా భర్త డబ్బును ఎక్కడ పెట్టాడో చెప్పకుండా చనిపోయాడంటూ" ఆమె అరిచిందటఈ కథ చెబుతూ ప్రతి ఒక్కరికి జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమైనదో, భార్యతో సహా ప్రజలు తమ కష్టానికి తగిన డబ్బు పొందకపోతే తట్టుకోలేరని లక్ష్మి వివరించింది.
ఆ నిర్మాత భార్య ఎన్నో సపర్యాలు చేసినప్పటికీ చివరికి ఆమెకు అతని సంపదలో చిల్లిగవ్వ కూడా మిగలలేదని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని లక్ష్మి పేర్కొంది.
నటి లక్ష్మి డబ్బు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి.
చుండ్రుతో దిగులెందుకు.. పుదీనా ఉందిగా అండగా..!