సీనియర్ నటి జమున ఇకలేరు!

వెండితెర సత్యభామ సీనియర్ నటి జమున నేడు ఉదయం ఆఖరి శ్వాస వదలారు.

ఈమె హైదరాబాదులోని తన స్వగృహంలో నేడు ఉదయం మరణించారు.వయో వృద్ధాప్యంతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి నటి జమున నేడు తుది శ్వాస వదిలారు.

ఇక ఈమె భౌతిక కాయాన్ని నేడు ఉదయం 11 గంటలకు అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ తరలించనున్నారు.

నటిగా పుట్టిల్లు సినిమాతో వెండితెరకు పరిచయమైన జమున ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.

"""/"/ నటిగా ఈమెకు మిస్సమ్మ సినిమా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది.

తెలుగు చిత్ర పరిశ్రమాలో సుమారు 150 కి పైగా సినిమాలలో నటించిన జమున ఎన్టీఆర్ ఏఎన్నార్ జగ్గయ్య వంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించారు.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ హిందీ భాషలలో కూడా ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను రివార్డులను అందుకున్నారు.

"""/"/ 1936 ఆగస్టు 30న హంపిలో జన్మించిన జమున 1953వ సంవత్సరంలో పుట్టిల్లు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.

1964వ సంవత్సరంలో విడుదలైన మూగమనసులు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఈ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు.

ఇక ఈమె కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా రాణించారు.ఇలా వెండితెరపై రాజకీయాలలోను ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జమున మరణ వార్త తెలియగానే సినీ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.

భద్రాద్రి జిల్లాలో గన్ మిస్ ఫైర్ .. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి