ఆస్తుల విషయంలో క్లారిటీ ఇచ్చిన నటి వరలక్ష్మి.. అన్ని రూ.కోట్లంటూ?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలలో నటించి ఒక వెలుగు వెలిగిన నటీనటీలు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ దూరం అవుతూ ఉంటారు.

ఇప్పటికే ఎంతోమంది ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో కనుమరుగైన విషయం తెలిసిందే.అటువంటి వారిలో సీనియర్ నటి బేబీ వరలక్ష్మి కూడా ఒకరు.

1973లో మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది.

తాజాగా నటి బేబీ వరలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది.

అయితే బేబీ వరలక్ష్మి తెలుగులో ఎక్కువగా హీరోలకు చెల్లెలి పాత్రలో నటించి మెప్పించింది.

మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత పూర్తిగా చెల్లెలి పాత్రలకు పరిమితం అయిపోయింది.

అయితే తెలుగులో చెల్లెలి పాత్రలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ బాలీవుడ్ సినిమాలలో హీరోయిన్గా నటించి మెప్పించింది.

తన జీవితంలో ఎదురైనా పలు చేదు అనుభవాల గురించి చెబుతూ బాగోద్వేగానికి లోనయ్యింది.

సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు తాను బాగా ఏడ్చేసానని ఆమె తెలిపింది.అయితే తనని సిస్టర్ వరలక్ష్మి లేదా బేబీ వరలక్ష్మి అనే పిలిస్తే పలుకుతాను కానీ రేపుల వరలక్ష్మి అని పిలిస్తే మాత్రం తాను చాలా బాధపడతాను అని తెలిపింది.

"""/"/ కొంతమంది సహనటులు తనను రేపుల వరలక్ష్మి అని పిలిచేవారనీ అది తనకు నచ్చేది కాదని ఆమె ఆ విషయాన్ని గుర్తు చేసుకుంది.

అనంతరం తన అస్తుల విషయాల గురించి కూడా ఆమె స్పందించింది.తెలుగులో హీరోయిన్ కి దీటుగా సినిమాలు చేసిన వరలక్ష్మి పారితోషికం కూడా హీరోయిన్ రేంజ్ లోనే తీసుకున్నట్లు తెలిపింది.

అయితే చెన్నైలో తనకు కోట్ల ఆస్తులు ఉన్నాయి అన్న విషయంపై ఆమె స్పందిస్తూ.

అదంతా నిజం కాదని అవన్నీ వట్టి రూమర్సే అని, అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులకు చాలా తక్కువగా పారితోషికాలు ఉండేవని, కానీ అందరికంటే ఎక్కువగా పారితోషకం తీసుకున్నది మాత్రం శాలిని అని తెలిపింది.

"""/"/తన పారితోషికాలు తన స్కూల్ ఫీజులకు కూడా సరిపోయేవి కాదని, తన తండ్రి స్కూల్ ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందులు పడేవారు అని ఆమె చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత సినిమాలలో చెల్లెలు పాత్రలు చేయడం మొదలుపెట్టిన తర్వాత బాగా పారితోషికాలు అందుకున్నట్లు నటి వరలక్ష్మి తెలిపింది.

తనకు కోట్ల ఆస్తులు ఏమీ లేవని మినిమం ఆస్తులు సంపాదించుకొని ప్రస్తుతం సంతోషంగానే ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

యూకే: ఎత్తు శాపమనుకుంది… ఇప్పుడదే లక్షణంతో కోట్లకు పడగలెత్తింది!