విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారి ముఖం మీద ఉమ్మేసిన సీనియర్ నటుడు?
TeluguStop.com
వినడానికి ఆశ్చర్యంగా ఉన్న, మీరు విన్నది అక్షర సత్యం.ఇదే విషయాన్ని కోటా శ్రీనివాసరావు గారు( Kota Srinivasa Rao ) ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.
ఇక కోట శ్రీనివాసరావు గురించి జనాలకి చెప్పాల్సిన అవసరం లేదు.ఆయనలాంటి నటుడు ఇప్పటి తరానికి దొరకడం చాలా కష్టమే.
తన సినిమా ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన కోట, మాత్రమే కాకుండా.
తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటిస్తూ తన ఉనికిని చాటుకున్నారు.
హీరోలు సైతం ఆయన నటనకి వంగి సలాం చేస్తారు.అలాంటిది ఒక బడా హీరో ఆయన ముఖం మీద ఉమ్మి వేశాడని ఎవరైనా ఊహించగలరా? అయితే ఈ విషయాన్ని స్వయంగా ఆయనే కొన్నాళ్ల క్రితం ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.
"""/" /
ఇక ఆ నటుడు మరెవ్వరో కాదు.నందమూరి బాలకృష్ణ.
( Nandamuri Balakrishna ) ఒక సినిమా షూటింగ్ కోసం ఒక హోటల్లో బస ఏర్పాటు చేశారట.
మొదట అక్కడకు చేరుకున్న కోటా శ్రీనివాసరావు గారు ఏదో ఆలోచించుకుంటూ లిఫ్ట్ దగ్గర నిలుచుండి పోయారట.
సరిగ్గా అదే సమయంలో అటువైపుగా బాలయ్య వెళ్లడంతో, కొందరు కోట శ్రీనివాసరావు గారికి చేతులు ఊపుతూ కనబడ్డారట.
విషయం అర్థం కాక కోట అలాగే నిలబడే చూస్తున్నాడట.అయితే అప్పటికే దగ్గరకొచ్చిన బాలయ్య కోటా గారి ముఖం మీద ఉమ్మి వేసి లోపలికి వెళ్ళిపోయాడట! ఇక విషయం అర్థం కాని కోట శ్రీనివాసరావు గారు ఏం చేయాలో తెలియక, ఏం తప్పు జరిగిందో తెలియక బిత్తర చూపులు చూసాడట! ఆ తర్వాత అక్కడ జనాలు.
మిమ్మల్ని పక్కకి తప్పుకొమ్మని చెప్పాము కదా? అలా తప్పుకుంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా! అని ఏదో సరిది చెప్పగా, కోట బాధపడుతూ హోటల్ లోపలికి వెళ్లిపోయారట! """/" /
ఇదే విషయాన్ని చెబుతూ కోటా శ్రీనివాసరావు గారు చాలా ఎమోషనల్ అయ్యారు.
బాలయ్య అప్పుడు అలా ఎందుకు ప్రవర్తించాడో ఇప్పటికీ తెలియదని అన్నారు.అయితే సదరు వీడియో చూసిన కొందరు నెటిజన్లు బాలయ్య పై సీరియస్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.
బాలయ్యకి జాతకాల పిచ్చి పీక్స్ లో ఉంటుందని, ఆయన ఎక్కడికన్నా వెళ్లిన, వెళ్లి తిరిగి వచ్చిన కూడా ఎదురుగా ఎవరూ వెళ్ళకూడదు అని మనసులో అనుకుంటాడట! ఒకవేళ అలా ఎవరైనా ఎదురు వెళితే ఇలాగే ఉమ్మి వేస్తాడని, బాలయ్య నిజ స్వరూపం గురించి కామెంట్స్ చేస్తున్నారు.
అయితే అప్పుడు జరిగిన తప్పుకి ఇప్పటికీ బాలయ్య రియాక్ట్ కాకపోవడం కొసమెరుపు!.
Bet Plays Mobile App And Mobile Experience: A Practical Guide For Canadian Players