Actor Devaraj: ఆ హీరోయిన్ ను చూడటానికి వెళ్ళి లవ్ లో పడ్డాను.. విలన్ దేవరాజ్ కామెంట్స్ వైరల్?

తెలుగు ప్రేక్షకులకు నటుడు దేవరాజ్( Actor Devaraj ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మొదట భరతనాది అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దేవరాజ్ ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ తీసుకుపోయారు.

అలా తన 38 ఏళ్ల సినిమా కెరియర్ లో దాదాపుగా 200 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు దేవరాజ్.

తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీ కన్నడ సినిమాలలో కూడా నటించారు.కేవలం విలన్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా నటించి మెప్పించారు.

తెలుగులో ఎక్కువ శాతం విలన్ గానే నటించారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవరాజ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా దేవరాజ్ మాట్లాడుతూ.నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి వచ్చాను మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు.

మా అమ్మ పాల వ్యాపారం చేస్తూ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది.చదువుకునేటప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగో లేకపోవడంతో అప్పుడే ఒక కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యాను జాబ్ చేస్తున్న సమయంలో సినిమాలో అవకాశాలు వచ్చాయి.

"""/" / సినిమా ఫిలిం లో సక్సెస్ కావాలని టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి అప్పుడు సినిమాల్లో పరిస్థితులు వేరు.

నా భార్య చంద్రలేక కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి.ఒక సినిమాకు హీరోయిన్ గా చూడడానికి వెళ్లాను.

చంద్రలేఖను ( Chandralekha ) చూడగానే నచ్చేసింది.ఆ తర్వాత ప్రేమ పెళ్లి జరిగాయి.

నా చిన్న కుమారుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమా చేశాడు.పెద్దోడు కూడా సినిమాలోకి వచ్చాడు అని చెప్పుకొచ్చాడు దేవరాజ్.

"""/" / అనంతరం జూనియర్ ఎన్టీఆర్ గురించి స్పందిస్తూ.జూనియర్ ఎన్టీఆర్ కు వాళ్ళ తాత టాలెంట్ వచ్చింది అంటూ ప్రశంసలు కురిపించారు.

అప్పట్లో కన్నడలో ఎందుకు మంచి సినిమాలు చేయలేకపోతున్నాం అన్న ఫీలింగ్ ఉండేది.కానీ కేజిఎఫ్ కాంతార సినిమాలతో ఆ పరిస్థితి మారిపోయింది.

అందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చారు నటుడు దేవరాజ్.దేవరాజ్ కొడుకు ప్రణమ్ ఇప్పటికే హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా నాకు పెద్ద గుణపాఠం నేర్పింది… దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు ?