Brahmaji RGV: రామ్ గోపాల్ వర్మకి కథ చెబితే.. అలాంటి టైటిల్ పెట్టాడు : నటుడు బ్రహ్మాజీ
TeluguStop.com
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ( Brahmaji ) తనయుడు సంజయ్ రావు హీరోగా నటించిన తాజా చిత్రం స్లమ్ డాగ్ హస్బెండ్.
ఇందులో సంజయ్ సరసన ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించింది.ఈ మూవీకి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు.
ఈ మువీ రేపు అనగా జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన బ్రహ్మాజీ తాజాగా మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా బ్రహ్మజీ మాట్లాడుతూ.స్లమ్ డాగ్ హజ్బెండ్( Slum Dog Husband ) స్టోరీని రామ్ గోపాల్‌వర్మకు( Ram Gopal Varma ) వినిపించి టైటిల్ అడిగితే కుక్క మొగుడు అయితే బాగా సెట్ అవుతుందని చెప్పారు.
కానీ మా నిర్మాత మాత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్ అని పెడితేనే బాగుంటుందని ఆ టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమా కథ, కథనం రెండూ కొత్తగా ఉంటాయి.ప్రేక్షకులను కచ్చితంగా ఈ మూవీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అని సీనియర్ నటుడు బ్రహ్మాజీ అన్నారు.
మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా షూటింగ్ సమయంలోనే నిర్మాత అప్పి రెడ్డి ఈ కథ, కాన్సెప్ట్ గురించి చెప్పారు.
ఒక కొత్త దర్శకుడు కథ చెప్పాడు విని, సలహా చెప్పండి అని అన్నారు.
కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది.బాగుందని చెప్పాను.
ఇందులో లాయర్ పాత్రను మీరే అనుకుంటున్నామని చెప్పారు.మరి హీరో ఎవరు అని అడిగితే ఇంకా డిసైడ్ కాలేదని అన్నారు.
"""/" /
ఆ తరువాత ఒక నెలకు మా అబ్బాయిని అడగమని అన్నారు.
సంజయ్‌కి( Sanjay Rao ) స్టోరీ చెబితే నచ్చింది.ఆ విధంగా సినిమా మొదలు పెట్టాం అని తెలిపారు బ్రహ్మాజీ.
కాగా మాములుగానే సంజయ్ డాగ్ లవర్ అవ్వడంతో కాన్సెప్ట్‌కు ఈజీగా కనెక్ట్ అయ్యాడు.
పైగా ఇది చాలా కొత్త కాన్సెప్ట్.మొన్న ఒక సారి పుష్ప పార్ట్ 2( Pushpa 2 ) షూటింగ్‌లో ఉన్నాను.
రాత్రి పూట షూటింగ్ జరుగుతోంది.బన్నీ ఆ ట్రైలర్‌ను చూసి నా దగ్గరకు వచ్చి ప్రశంసించాడు.
ట్రైలర్ నిజంగా బాగుందని అన్నాడు.టీం అందరికీ చెప్పి చూపించాడు.
మామూలుగా నేను కొత్తగా చేసే పాత్రలు రావు.ఎందుకంటే రకరకాల పాత్రలు చేసి ఉన్నాను.
"""/" /
కానీ ఇందులో మాత్రం నిజంగానే ఒక కొత్త కారెక్టర్ దొరికింది.
ఓల్డ్ సిటీలో ఉండే లాయర్.ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడే ఒక కారెక్టర్.
విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా ఇందులో కనిపిస్తాను.సప్తగిరి నాకు మంచి స్నేహితుడు.
ఈ సినిమాలో మా ఇద్దరి సీన్లు పోటాపోటీగా ఉంటాయి.సప్తగిరి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి.
ఇందులో జడ్జిగా ఫిష్ వెంకట్ కనిపించడం హైలెట్‌గా నిలుస్తుంది.జూలై 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాము.
కానీ అదే సమయంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని జూలై 29న ఫిక్స్ అయ్యాము అని తెలిపారు బ్రహ్మాజీ.
పెళ్లి చేసుకోండి సక్సెస్ అదే వస్తుంది..కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్!