పాక్‌కు సాయం వద్దు.. భారత్‌కు అండగా నిలుద్దాం : యూఎస్ కాంగ్రెస్‌లో కీలక బిల్లు

భారత్ - అమెరికాల( India - America ) మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు బలోపేతం అవుతున్నాయి.

ప్రబల ఆర్ధిక శక్తిగా ఎదుగుతూ ఉండటం, అపారమైన మానవ వనరులు, అతిపెద్ద మార్కెట్ కావడంతో ఇండియాకు అగ్రరాజ్యం ప్రాముఖ్యతను ఇస్తోంది.

గడిచిన పాతికేళ్లుగా అమెరికా అధ్యక్షులుగా వ్యవహరించిన బిల్‌క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా, ట్రంప్, బైడెన్‌లు భారత్‌తో మెరుగైన సంబంధాలకు కృషి చేశారు.

వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, ఎగుమతి, దిగుమతులకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఎన్నో కీలక ఒప్పందాలు జరిగాయి.

ఇకపైనా జరుగుతాయి.అమెరికా సారథ్యంలోని పలు కూటముల్లోనూ మనదేశానికి ప్రాతినిథ్యం లభిస్తోంది.

అయితే భారత్‌తో సన్నిహితంగా ఉంటూనే అటు పాకిస్తాన్‌ను సైతం చేరదీస్తూ అమెరికా ద్వంద్వ నీతిని అవలంభిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

భారత్‌కు పక్కలో బల్లెంలా మారి, ఉగ్రవాదాన్ని ఎగదొస్తున్న దేశంతో అగ్రరాజ్యం అంటకాగడం మంచిది కాదని పలువురు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అమెరికాలో ప్రముఖ నేత, కాంగ్రెస్ సభ్యుడు మార్క్ రుబియో ( Mark Rubio )గురువారం యూఎస్ కాంగ్రెస్‌లో కీలక బిల్లును ప్రవేశపెట్టారు.

అమెరికాకు మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా భారత్‌ను పరిగణించాలని ఆయన బిల్లులో పేర్కొన్నారు.

"""/" / సాంకేతికత బదిలీ, ఆయుధపరంగా సహకారం విషయంలో న్యూఢిల్లీకి అమెరికా అండగా ఉండాల్సిన అవసరం ఉందని రుబియో ప్రస్తావించారు.

భారత ప్రాదేశిక సమగ్రతకు ముప్పు పొంచి ఉందని.దీనికి కారణమైన పాకిస్తాన్‌ కారణమని తేలితే భద్రతాపరమైన సాయాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇండో - పసిఫిక్ రీజియన్‌లో( Indo-Pacific Region ) అమెరికా మిత్రదేశాల సార్వభౌమత్వానికి చైనా సవాల్ విసురుతోందని రుబియో ఆందోళన వ్యక్తం చేశారు.

చైనాను అడ్డుకోవాలంటే భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించాలని ఆయన తెలిపారు. """/" / అయితే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పట్లో ఈ బిల్లుకు మోక్షం కలిగే సూచనలు కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు.

ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య మాటల యుద్ధం జరుగుతుండటమే ఇందుకు కారణం.

అయితే భారత్‌తో సఖ్యతగా ఉండాలని రెండు పార్టీల కోరుకుంటూ ఉండటం సానుకూల పరిణామం.

నాని సినిమాకు విచిత్రమైన సమస్య.. నాగ్ పుట్టినరోజును ఎంచుకోవడమే శాపమైందా?