సక్సెస్ స్టోరీ: ఎన్ఆర్ఐ మహిళ స్పూర్తి.. గృహిణిని వ్యాపారవేత్తను చేసింది, ‘‘ టీ ’’తో కోట్ల టర్నోవర్
TeluguStop.com
ఆలోచన, ఆచరణ, క్రమశిక్షణ, పట్టుదల వుంటే అసాధ్యం అనేది వుండదని చాలా మంది నిరూపించారు.
కుటుంబంతో కలిసి వెళ్లిన విహారయాత్ర ఓ మధ్యతరగతి గృహిణిని వ్యాపారవేత్తగా మార్చింది.‘‘ ఏ చాయ్ చటుక్కునా తాగరా భాయ్.
ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్.ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్.
ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్' అంటూ ఓ సినీ గేయ రచయిత చాయ్ గురించి అద్భుతంగా వర్ణించారు.
చాలా మందికి టీ తాగనిదే పొద్దు గడువదు.టీతోనే దినచర్య మొదలవుతుంది.
స్నేహితులను కలిసినా, చుట్టాలు పలుకరించినా మొదట పంచుకునేది తేనీటి విందునే’’.కేవలం టీతోనే ఆ ఇల్లాలు అద్భుత విజయాలు సాధించింది.
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన పాయల్ మిట్టల్ అగర్వాల్ .ప్రస్తుతం హర్యానాలోని గురుగ్రామ్‌లో స్థిరపడ్డారు.
పాయల్ పాఠశాల స్థాయి నుంచి ఓ డ్రీమ్ ఉండేది.సొంతగా ఓ వ్యాపారాన్ని చేస్తూ పదిమందికి ఉపాధి కల్పించాలని.
అయితే పాయల్ కుటుంబం సభ్యులు మాత్రం ఆమెను ఉన్నత చదువులు చదవించాలనే ఆలోచనను చేశారు .
కానీ పాయల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేక పోయారు.చిన్న వయసులోనే పెళ్లి జరగడంతో ఆమె చదువును అర్థాంతరంగా వదిలివేశారు.
ఆ తర్వాత కూడా వ్యాపారం చేయాలనే కలను మాత్రం ఆమె అలానే కొనసాగించారు.
చిరు ప్రయత్నంగా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
"""/"/
ఈ నేపథ్యంలో ఒకసారి పాయల్ తన ఫ్యామిలీతో కలిసి యూరప్ టూర్‌కు వెళ్లారు.
ఈ పర్యటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.ఇదే సమయంలో డార్జిలింగ్ టీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను పాయల్ గమనించారు.
యూరప్‌లో చాయ్ అమ్ముతున్న ఓ భారతీయ మహిళను కలుసుకున్నారు.ఆ తరువాత పాయల్ తాను టీ వ్యాపారం ఎందుకు చేయకూడదనే ఆలోచన ఆమె బుర్రను తొలిచేసింది.
భారతదేశంలో అడుగుపెట్టిన వెంటనే తన ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు.కేవలం 7 లక్షల రూపాయల పెట్టుబడితో పాయల్ వ్యాపారాన్ని ప్రారంభించారు.
భారత్‌లో సాధారణంగా దొరికే టీకి భిన్నంగా పాయల్ ప్రీమియం టీలను కస్టమర్లకు అందించాలని భావించారు.
ఈ ఆలోచనతోనే సుమారు 100కు పైగా టీల రకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.ఇందులో గ్రే టీ, గ్రీన్ టీ, కహ్వా, జాస్మిన్ టీ, యాంటీ స్ట్రెస్ టీ, మసాలా టీ, డిటాక్స్ టీతో సహా చాలా రకాల టీలను అందిస్తున్నారు.
ఈ ఆలోచన ఫలించింది.ఇది ఆ నోటా ఈ నోటా ప్రజల్లోకి వెళ్ళిపోవడంతో వ్యాపారం ఊపందుకుంది.
ఇప్పుడు ఆమె చాలా కంపెనీలకు చాయ్ ప్యాకింగ్ చేసి అందిస్తున్నారు.ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారా తయారు చేసిన టీని విదేశాల్లోని కస్టమర్లకు కూడా పంపిస్తున్నారు.
ఇప్పుడు పాయల్ టర్నోవర్ రెండు కోట్ల రూపాయల పైమాటే.ఇంతటి విజయాన్ని సాధించిన పాయల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులు చేయలేదు.
పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో పని చేసిన అనుభవం కూడా లేదు.కేవలం తన ఆలోచనను పెట్టుబడిగా పెట్టి, ప్రణాళికా బద్దంగా పని చేసి తన లక్ష్యాన్ని చేరుకున్నారు.
‘డాకు మహారాజు’ లో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..? ఒక బాలయ్య చనిపోతాడా..?