మీ పాత ఫోన్ అమ్మాలనుకుంటే ఈ 5 వెబ్‌సైట్లలో ట్రై చేయండి… మంచి ధర వస్తుంది!

స్మార్ట్ ఫోన్స్ ఇపుడు రాజ్యమేలుతున్నాయి.నెలల వ్యవధిలోనే సరికొత్త ఫీచర్లతో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి.

అలాంటప్పుడు తమ వద్దవున్న పాత ఫోన్లని ఎవరు మాత్రం అలాగే తమ వద్ద పెట్టుకుంటారు.

వాటిని అమ్మేసి, కొత్తవి కొనే ప్రయత్నం చేస్తుంటారు.ముఖ్యంగా నేటి యువత మార్కెట్లోకి అప్పుడే వచ్చిన ఫోన్లవైపు మొగ్గు చూపుతున్నారు.

ఇలాంటప్పుడు సాధారణంగా ఇపుడు చాలామంది కొత్త ఫోన్ కొన్న తర్వాత పాత ఫోన్ ను ఏం చేయాలో తెలియక పక్కకు పడేస్తూ వుంటారు.

అలాంటి పరిస్థితులో మీరు మీ పాత ఫోన్ ను ఆన్లైన్లో సులభంగా అమ్మేయొచ్చు.

"""/" / అయితే దానికి మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు.దానికి సంబంధించిన టాప్ 5 వెబ్ సైట్స్ వున్నాయి.

OLX గురించి అందరికీ తెలిసినదే.ఇక్కడ దాదాపుగా ప్రతి పాత వస్తువును కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు.

అందులో దాదాపుగా సెకండ్ హేండ్ వస్తువులే ఉంటాయి.ఇక ఇక్కడ మొబైల్ ఫోన్లను కూడా అమ్మవచ్చు.

అదేవిధంగా మీరు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను విక్రయించాలనుకుంటే దిగ్గజ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ కూడా మరో బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

"""/" / ఈ వెబ్‌సైట్ కొత్త ఫోన్ కొనుగోలుపై పాత ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తుంది.

అమెజాన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద మీ పాత ఫోన్‌కు ఉత్తమమైన విలువ కడుతుంది.

ఆ మాదిరిగానే, ఫ్లిప్‌కార్ట్ కూడా కొత్త స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై తన కస్టమర్‌లకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తోందని మీకు తెల్సిన విషయమే కదా.

ఆ తరువాత సెకండ్ హ్యాండ్ ఫోన్‌ల కొనుగోలు మరియు విక్రయాలలో Cashify చాలా పేరు సంపాదించింది.

ఈ వెబ్‌సైట్ పాత మరియు ఉపయోగించిన స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తుంది.మరియు విక్రయిస్తుంది.

Cashify వెబ్‌సైట్‌లో మీరు కొన్ని వివరాలను నమోదు చేయడం ద్వారా మొబైల్ ఫోన్ విలువ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.