మహిళ రక్షణయే ప్రధాన్యంగా జిల్లా పోలీస్ శాఖ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు బుధవారం ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేజీబీవీ పాఠశాలలో ముస్తాబాద్ ఎస్.

ఐ శేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు "ఆపరేషన్ జ్వాల" సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్.ఐ శేఖర్ మాట్లాడుతూ మహిళల భద్రతను పెంపొందించేందుకు జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాలోని మహిళ విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణను ఏర్పాటు చేయడం జరిగిందని,అందులో భాగంగా ఈ రోజు ముస్తాబద్ మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఆపరేషన్ జ్వాల కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు.

ప్రస్తుత రోజులలో మహిళలకు స్వీయ రక్షణ చాలా అవసరమని అందుకే సెల్ఫ్ డిఫెన్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.

విద్యార్థినీలు ఆపద సమయాలలో ధైర్యంగా సమస్యను ఎదుర్కొనే విధంగా ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.

కేవలం ఆకతాయిల బారి నుండే కాకుండా చైన్ స్నాచింగ్, మహిళలపై లైంగిక దాడులు జరిగే క్రమంలో వారిని సమర్ధవంతంగా తిప్పికొట్టడం లాంటి టెక్నిక్స్ నేర్పించడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్క మహిళ స్వీయ రక్షణ విధానాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.

విద్యార్థినులు ఏలాంటి వేధింపులకు గురైన నిర్భయంగా ముందుకు వచ్చి జిల్లా షీ టీమ్ కి గాని డయల్ 100 కి సమాచారం అందించి సమస్యను పరిష్కరించుకోవలని అన్నారు.

రాజమౌళి మహేష్ బాబు సినిమా లో తమిళ్ స్టార్ హీరో నటిస్తున్నాడా..? అయితే ఇక రచ్చ రచ్చే..