Shekhar Master : అమ్మతో కలిసి స్టెప్పులేసిన శేఖర్ మాస్టర్.. అమ్మకు మించిన ప్రేమ ఈ ప్రపంచంలో లేదంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ వన్ కొరియోగ్రాఫర్ ఎవరనే ప్రశ్నకు ఎక్కువమంది శేఖర్ మాస్టర్( Shekhar Master ) పేరు సమాధానంగా చెబుతారు.

ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్థాయికి చేరుకున్న శేఖర్ మాస్టర్ తన టాలెంట్ తో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఎన్నో విజయాలను అందుకున్నారు.

ఆయన కొరియోగ్రఫీకి సామాన్యులతో పాటు సెలబ్రిటీలలో( Celebrities ) కూడా ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే ఢీ సెలబ్రిటీ స్పెషల్ లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది.ఈ ప్రోమోకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

అయితే ఎప్పుడూ టీవీ షోలకు పెద్దగా హాజరు కాని శేఖర్ మాస్టర్ తల్లి ఈ షోకు హాజరయ్యారు.

శేఖర్ మాస్టర్ తో కలిసి తల్లి అదిరిపోయే స్టెప్పులు వేశారు.అమ్మకు మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదని శేఖర్ మాస్టర్ చెప్పగా శేఖర్ మాస్టర్ తల్లి ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు.

వాలెంటైన్స్ డే ( Valentine's Day )రోజున ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండటం గమనార్హం.

"""/" / యాంకర్ నందు శేఖర్ మాస్టర్ తో మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తికి ఫోన్ చేసి ప్రపోజ్ చేయాలని కోరగా శేఖర్ మాస్టర్ తన వైఫ్ కు ఫోన్ చేశాడు.

థాంక్యూ.హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ శేఖర్ మాస్టర్ భార్య సమాధానం ఇచ్చారు.

హైపర్ ఆది యాంకర్ నందును( Anchor Nandu ) ఏదైనా ఎమోషనల్ మూమెంట్ చెప్పాలని కోరగా నందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా మీద ఒక రూమర్ వచ్చిందని నందు చెప్పుకొచ్చారు. """/" / నాకు ఎలాంటి సంబంధం లేని ఒక వార్తలో నా పేరు సోషల్ మీడియా వేదికగా తెగ వినిపించిందని నందు కామెంట్లు చేయడం గమనార్హం.

నేను తప్పు చేశానని 12 రోజులు న్యూస్ వేశారని నేను చేయలేదని తెలిసిన తర్వాత స్క్రోలింగ్ లో మాత్రమే వేశారని నందు అన్నారు.

ప్రదీప్ ఢీ షో మిస్ అయ్యాడనే లోటు నందు తీర్చేశాడని హైపర్ ఆది కామెంట్లు చేయడం గమనార్హం.