రాకేష్ మాస్టర్ పార్థివదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్ మాస్టర్ వీడియో వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్(Rakesh Master) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూసిన విషయం మనకు తెలిసిందే.

ఇలా అనారోగ్య సమస్యలతో మరణించారన్న వార్త తెలియడంతో తోటి కొరియోగ్రాఫర్లు, ఆయన శిష్యులు కన్నీటి పర్యంతరం అయ్యారు.

ఇలా రాకేష్ మాస్టర్ మృతి పట్ల పలువురు సంతాపం కూడా ప్రకటించారు.ఇక రాకేష్ మాస్టర్ ఎంతోమందిని ఇండస్ట్రీకి కొరియోగ్రాఫర్లుగా పరిచయం చేసిన సంగతి మనకు తెలిసిందే.

వారిలో జానీ మాస్టర్(Johnny Master) శేఖర్ మాస్టర్ (Sekhar Master) వంటి వారు కూడా ఒకరు.

"""/" / ఇక రాకేష్ మాస్టర్ సినిమాలకు దూరంగా ఉంటూ పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో హాజరవుతూ పలువురుసిన సెలబ్రిటీల గురించి తన శిష్యుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ గురించి ఈయన సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆరోపణలు కురిపించారు.

వీరిద్దరికీ ఎక్కడ మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ వీరు మాత్రం ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు.

శేఖర్ మాస్టర్ పేరు ఎత్తితే చాలు రాకేష్ మాస్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసేవారు.

"""/" / రాకేష్ మాస్టర్ ఒకానొక సమయంలో మాట్లాడుతూ నేను చనిపోతే శేఖర్ మాస్టర్ బాధపడడు సంతోషంగా ఫీల్ అవుతారంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు.

అయితే రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈయనని చివరి చూపు చూడటం కోసం శేఖర్ మాస్టర్ వస్తారా .

రారా అన్న సందేహం అందరిలోనూ నెలకొంది.అయితే శేఖర్ మాస్టర్ మాత్రం వారి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను పక్కనపెట్టి తన గురువు గారిని చివరి చూపు చూడటం కోసం వచ్చారు.

ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్, రాకేష్ మాస్టర్ పార్థివదేహం చూసి ఒక్కసారిగా కన్నీటి పర్యంతరం అయ్యారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.