మాకు డ్యాన్స్ తప్ప వేరే ఏం రాదు.. శేఖర్ మాస్టర్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ( Shekhar Master )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగులో చాలా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్.

ఒకవైపు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేస్తూనే మరొకవైపు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు శేఖర్ మాస్టర్.

ఇది ఇలా ఉంటే తాజాగా శేఖర్ మాస్టర్ షోలో ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

"""/" / ఇంతకీ ఏం జరిగింది శేఖర్ మాస్టర్ ఎందుకు ఎమోషనల్ అయ్యారు అన్న విషయానికి వస్తే.

తాజాగా ఢీ షోకి ( Dhee Show )సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు.

అందులో మధు అనే కంటెస్టెంట్ పక్కన డ్యాన్సర్లు తప్పు వేయడంతో మధ్యలో పర్ఫార్మెన్స్ ఆపేసారు.

దీంతో శేఖర్ మాస్టర్ దీని గురించి మాట్లాడారు.ఆ పర్ఫార్మెన్స్ ని కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్ స్టేజిపైకి వచ్చాక శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.

మేము డ్యాన్సర్లు కదా.మాకు డ్యాన్స్ తప్ప వేరే ఏం రాదు.

డ్యాన్స్ మిస్ అయితే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడో, మాస్టర్ వెళ్ళిపోతే మాకు ఎక్కడ వర్క్ పోతుందో అని భయపడేవాళ్ళం అంటూ ఎమోషనల్ అయి ఏడ్చేశారు.

"""/" / శేఖర్ మాస్టర్ మాటలకు అక్కడున్న కంటెస్టెంట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు.

ఆ పర్ఫార్మెన్స్ కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్( Dance Master ) కూడా స్టేజిపైనే ఏడ్చేశాడు.

మరి శేఖర్ మాస్టర్ ఇంకేం మాట్లాడారో, ఎందుకు అలా ఏడ్చేసారో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియో పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

మూవీ మేకర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్.. పెళ్లి ఒకరితో ఫస్ట్ నైట్ ఒకరితో అంటూ!