అనుమతి లేని ఇసుక లారీల పట్టివేత…

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామం వద్ద ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రమాకాంత్ తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తుండగా పోలీస్ వాహనానికి ఎదురుగా మూడు ఇసుక లారీలను ఆపి డ్రైవర్లను ఇసుక తరలించడానికి పర్మిషన్ చూపమంటే వారి వద్ద ఎలాంటి ప్రభుత్వ పర్మిషన్ పత్రాలు లేకపోవడంతో దొంగతనంగా ఇసుక తరలిస్తున్నారని పోలీసులు గమనించారు.

వెంటనే మొదటి లారీ టీఎస్ 22.టీ.

9520 నెంబర్ గల లారీ డ్రైవర్ పెద్దపల్లి మండలం పెద్ద కాల్వల గ్రామం గుండవెన నాగేష్ 27 యజమాని గుండవేన స్వామి ఆదేశాల మేరకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నానని,రెండో లారీ టీఎస్.

02.యుసి.

0594 డ్రైవర్,యజమాని దూల వెంకటేష్ 29 కొత్తపల్లి మండలం అసిఫా నగర్ బాబుపేట్ గ్రామం ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నాడని తెలిపాడు, మూడో లారీ టీఎస్.

02.యుఈ.

0663 ఓనర్,డ్రైవర్ పల్లపు కుమార్ 32 తారకరామానగర్ జగిత్యాల అని తెలిపాడు.విరికి ప్రభుత్వం నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ దొంగతనంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని కాజీపూర్ వాగులో నుండి అక్రమంగా లారీలో ఇసుకను నింపుకొని దానిని కామారెడ్డి జిల్లాలో అమ్మడానికి తరలిస్తున్నామని పోలీసులకు తెలుపగా.

ముగ్గురు వ్యక్తుల పై ఎల్లారెడ్డిపేట ఎస్ఐ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరు ఇసుక తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రమాకాంత్ హెచ్చరించారు.

రజినీకాంత్ చేయాల్సిన రేలంగి మామయ్య రోల్.. ఎలా మిస్ అయ్యింది