రూ.10 లక్షల విలువ గల నిషేధిత గుట్కా పట్టివేత

నల్లగొండ జిల్లా: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నిషేధిత గుట్కా వ్యాపారంపై నల్లగొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలో రూ.10 లక్షల విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ మరియు నల్లగొండ వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ లో ఓలా లక్ష్మీనరసింహయ్య అనే వ్యాపారి నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ చేశారనే పక్కా సమాచారంతో పోలీసులు అతడి దుకాణాంలో తనిఖీలు నిర్వహించి,అమ్మకానికి నిలువ ఉంచిన నిషేధిత భారీ గుట్కా బ్యాగులను గుర్తించి సీజ్ చేశారు.

నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఎట్టిపరిస్థితుల్లో అక్రమంగా గుట్కా రవాణా చేసినా, నిల్వ చేసినా,అమ్మకాలు జరిపినా సదరు వ్యక్తులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది, ఎస్‌ఐ వి.శంకర్,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఈటెల రాజేందర్ కు ఆ పదవి ఫిక్స్ కాబోతోందా ?