మంత్రి పువ్వాడ అజయ్ కు నిరసన సెగ.!
TeluguStop.com
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జూలూరుపాడు మండలం జూలూరుపాడు లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తదితరులతో వచ్చిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ్ కు నిరసన సెగ తగిలింది.
గతంలో జూలూరుపాడు సెంటర్ లో తొలిగించిన అంబేద్కర్ దిమ్మె స్థానంలో నూతనంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాడానికి అనుమతి ఇవ్వాలంటూ బీఎస్పీ మరియు అంబేద్కర్ యువజన సంఘం కు చెందిన కొందరు ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలియజేశారు.
దీనితో టిఆర్ఎస్ కు చెందిన కార్యకర్త ఒకరు ప్లకార్డ్స్ ను గుంజుకుని చించివేయడంతో ఆగ్రహించిన వారు రోడ్ పై బయటాయించారు.
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ఎమ్మెల్సీ తాత మధు ను అడ్డుకొని ప్లేకార్డులతో నిరసన తెలియజేశారు.
దీనితో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించే క్రమంలో అక్కడే ఉన్న పంచాయతీ కార్మికులు సైతం అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మా పై దౌర్జన్యంగా టిఆర్ఎస్ కార్యకర్తలు ప్ల కార్డ్స్ చించివేయడం అనేది దారుణం అని వారు అన్నారు.
How Modern Technology Shapes The IGaming Experience