సాయిధరమ్ తేజ్ ను ఆ స్థితిలో చూసి కన్నీళ్లు ఆగలేదు.. తనకు ఇది పునర్జన్మ: సుకుమార్
TeluguStop.com
మెగా హీరో సాయిధరమ్(Sai Dharam Tej) తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత ఈ ప్రమాదం నుంచి కోలుకొని సినిమా ఇండస్ట్రీలో తిరిగి అడుగు పెట్టారు.
ఇలా ఈయన ప్రమాదం తర్వాత నటించిన విరూపాక్ష సినిమా(Virupaksha Movie) ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు ఈయన హాజరవుతున్నారు.అలాగే ఏలూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.
"""/" /
ఇలా ఈ సినిమా వేడుకకు సుకుమార్ (Sukumar)ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సాయి ధరమ్ తేజ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఎప్పుడు నవ్వుతూ ఎంతో చలాకీగా సెట్లో అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండే సాయి ధరమ్ తేజ్ ప్రమాదం తర్వాత కోలుకొని విరూపాక్ష సినిమా షూటింగ్ లోకేషన్ లోకి అడుగుపెట్టారు.
ఏ సీన్ అయినా డాన్స్ అయినా ఎంతో అవలీలగా చేసే సాయి ధరమ్ తేజ్ ప్రమాదం తర్వాత యాక్టింగ్ డాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు.
ఇలా తను పడుతున్న ఇబ్బంది తట్టుకోలేకపోయానని ఈ సందర్భంగా సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
"""/" /
ఇలా పెద్ద ప్రమాదం నుంచి కోలుకొని ఈయన తిరిగి ఇలా షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషించాల్సిన విషయమని, ఇది సాయి ధరమ్ తేజ్ కి పునర్జన్మ అంటూ ఈ సందర్భంగా సుకుమార్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఎన్నో అంచనాల నడుమ క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విరూపాక్ష సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటి సంయుక్త మీనన్(Samyuktha Menon) నటించిన విషయం మనకు తెలిసిందే.
Skill Vs Luck: Data Analytics, Player Strategy, And The Reality Behind Bluff Bet Casino For Canadian Crypto Users