చిన్న కుక్కను కాపాడేందుకు పెద్ద కుక్క ఏం చేసిందో చూడండి.. వావ్ అంటారంతే..
TeluguStop.com
చాలామంది చిన్నప్పటి నుంచి కథలు వింటుండేవారు.ఆ కథలు మన కండ్లకి కనబడినపుడు ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటాం.
మనకు కాకి కథ తెలుసే ఉంటుంది.బాగా దాహం వేసినపుడు కాకి నీటి కోసం వెతుకుతుండగా ఓ కుండలో అడుగులో ఉన్న నీటిని చూసి తాగేందుకు యత్నిస్తుంది.
అవి దాని నోటికి అందకపోవడంతో ఆలోచించగా ఉపాయం తడుతుంది.వెంటనే ఒక్కో రాయిని తీసుకొచ్చి కుండలో వేస్తుంది.
దీంతో కుండ అడుగున నీరు పైకి రాగా కాకి తాగి దాహం తీర్చుకుంటుంది.
ఇది ప్రత్యక్షంగా కండ్లకు కనబడినపుడు ఔరా అనక మానరు.ఇలాంటి ఘటనే ట్విట్టర్‌లో పోస్టు చేయగా ప్రజాధరణ పొందింది.
వండర్, అమేజింగ్, సూపర్, బెస్ట్ ఆక్షన్ మూవీ అంటూ తెగ కామెంట్లు కూడా పెట్టేశారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందని భావిస్తున్నారా.ఓ కుక్క ఆపదలో ఉపాయంతో చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.
"""/"/
ఓ స్మాల్ డాగ్ రోడ్డు సైడ్ ఉన్న గుంతలో పడిపోయింది.పైకి వచ్చేందుకు ఎన్ని సార్లు ట్రై చేసినా పైకి రాలేకపోతుంది.
దాని అరుపులు విన్న మరో బిగ్ డాగ్ గుంత దగ్గరకు వచ్చి చూసి పైకి చేర్చేందుకు నానా తంటాలు పడుతుంది.
చివరికి ఓ ఉపాయం తట్టగా పక్కనే ఉన్న ఎంటీ బాక్సులను ఒక్కొక్కటిగా తీసుకొచ్చి గుంతలో వేస్తుంది.
చిన్న డాగ్ పైకి వచ్చేలా బాక్సులను సెట్ చేస్తుంది.దీంతో ఆ డాగ్ ఈజీగా పైకి వచ్చి బిగ్‌డాగ్‌తో హ్యాపీగా వెళ్తుంది.
దీనిని బట్టి మనం ఒకటి తెలుసుకోవాలి.ఆపద ముంచుకొచ్చినపుడు గాబరా పడకుండా ఆలోచించాలి.
ఉపాయంతో సమస్యనుంచి బయటపడాలి.అందుకే పెద్దలు అంటుంటారు.
ఉపాయంతో ఆపాయాన్ని తప్పించుకోవచ్చని.మరి మీరు ఏమంటారు.
? ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.
డోలు బీట్స్‌కు బుల్లి పంజాబీ పాప దుమ్ములేపే డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారు భయ్యా..