వైరల్ వీడియో: మంట పెడితే ఇంజన్ ఎలా నడుస్తుందో చూడండి..
TeluguStop.com
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సైన్స్ వీడియోలు( Science Videos ) మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.
తాజాగా ఒక ఇంజన్( Engine ) ఎలా పనిచేస్తుందో చూపించే వీడియో వైరల్ గా మారింది.
దీనిని సైన్స్ అనే ప్రముఖ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా వ్యూస్, రెండువేల దాకా లైక్స్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో మనం స్టిర్లింగ్ ఇంజన్( Stirling Engine ) మోడల్ చూడవచ్చు.
ఇది ఒక రకమైన ఎక్స్‌టర్నల్ కంబషన్ మెషిన్, ఇది ఇంజన్ లోపల దహన ప్రక్రియ జరగకుండానే ఉష్ణ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది.
ఆ మండే ద్రవం ఎక్స్‌టర్నల్ గా వేడిని అందించినప్పుడు ఇంజన్ ఎక్స్‌పాండ్ అయి, ఆపై విస్తరిస్తుంది.
అనంతరం ఇంజన్ రన్ అవుతుంది. """/" /
స్టిర్లింగ్ ఇంజన్లు సాధారణంగా ఆవిరి ఇంజిన్‌ల వంటి ఇతర రకాల హీట్ ఇంజిన్‌ల కంటే మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి.
అవి అనేక రకాల ఇంధనాలపై(
Fuel ) కూడా పనిచేస్తాయి.అందువల్ల దీనిని విద్యుదుత్పత్తి, రవాణా, అంతరిక్ష అన్వేషణతో సహా వివిధ రకాల ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు.
"""/" /
వైరల్ వీడియోలో మూడు పరికరాలకు మంట అంటించగా అవి వెలగడం మనం చూడవచ్చు.
ఒక వ్యక్తి ఇంజన్‌ను రెండుసార్లు రన్ చేశాడు.ఆపై ఇంజన్ వేడి వల్ల దానంతటదే రన్ కావడం మనం చూడవచ్చు.
ఈ సైన్స్ చూసేందుకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.దీనిని చూసి చాలామంది వావ్ అంటున్నారు.
ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.
How Modern Technology Shapes The IGaming Experience