కడ్డీల మధ్యలో ఇరుక్కుపోయిన పిల్లాడి తల.. ఎలా బయటకు వచ్చాడో చూడండి!

సాధారణంగా చిన్న పిల్లలు ఒక్క చోట ఉండరు.అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు.

అలానే కొన్ని విషయాల్లో అనవసరంగా తలదూర్చుతూ ప్రమాదాల్లో పడుతూ ఉంటారు.చాలా మంది పిల్లలు తమ చిన్నతనంలో ఏదో ఒక సందులో దూరడం లేదా ఇనుప కడ్డీల మధ్య నుంచి వెళ్లడం చేస్తుంటారు.

ఇలా ఇప్పటికే ఎందరో తమ తలలను ఇనుప కడ్డీల మధ్యలో పెట్టి అలానే ఇరుక్కుపోయి నానా అవస్థలు పడ్డారు.

తాజాగా మరొక చిన్నపిల్లాడు కూడా ఇలాంటి పరిస్థితులలోనే స్టక్ అయ్యాడు.@TheFigen అనే ప్రముఖ ట్విట్టర్ పేజీ దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేసింది.

ఈ వీడియోకి 46 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.వైరల్ అవుతున్న వీడియోలో ఫెన్సింగ్ లాంటి ఒక ఇనుప కడ్డీల వరుసలో ఒక చిన్న పిల్లాడి తల ఇరుక్కుపోవడం గమనించవచ్చు.

ఆ పిల్లాడిని కాపాడేందుకు తండ్రి అన్నివిధాలా ప్రయత్నించాడు.తన కాళ్లతో బలంగా ఆ కడ్డీల మధ్య గ్యాప్ పెంచాలని అనుకున్నాడు.

కానీ అది సాధ్యం కాలేదు.దాంతో ఆ చిన్నారి అందులో నుంచి బయటకు రాలేక చాలా భయపడి పోయాడు.

ఆ తర్వాత ప్రశాంతంగా ఆలోచించిన ఆ బాలుడు అందులో తన తలను తాను ఎలా ఇరికించుకున్నాడో అర్థం చేసుకున్నాడు.

ఆ తర్వాత మొదటగా అందులోకి ఎలా దూరాడో బయటికి కూడా అదే మార్గంలో వచ్చాడు.

"""/"/ అలా ఈజీగా ఆ కడ్డీల మధ్యలో నుంచి బయటకు తీశాడు.దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ప్రశాంతంగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు.మరికొందరు మాత్రం తల్లిదండ్రుల తీరుపై మండిపడుతున్నారు.

"మీ పిల్లాడు చావుబతుకుల పరిస్థితులలో చిక్కుకుపోతే వీడియో తీస్తారా అసలు సిగ్గుందా మీకు?" అని ఒక యూజర్ ఘాటుగా ప్రశ్నించారు.

అయితే ఆ పిల్లడిని తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉంటే అది ప్రమాదం కానీ ఇదేం పెద్ద ప్రమాదం కాదు.

ఎందుకంటే పిల్లాడిని వారు కాపాడేందుకు ప్రయత్నించారు.వారిని తిట్టడం సబబు కాదని కొందరు కామెంట్ చేస్తున్నారు.

దేవర సినిమా రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే!