కేసీఆర్ యాత్రకు భద్రత కల్పించాలి.. సీఈవోకి బీఆర్ఎస్ విజ్ఞప్తి

తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ను( Vikas Raj ) బీఆర్ఎస్ నేత కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి( Ketireddy Vasudeva Reddy ) కలిశారు.

ఈ మేరకు తమ పార్టీ అధినేత కేసీఆర్( KCR ) చేపట్టనున్న బస్సు యాత్ర అనుమతి కోసం వికాస్ రాజ్ ను కలిసినట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీ నుంచి మే 10 వరకు జరగనున్న కేసీఆర్ యాత్ర వివరాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి తెలిపారు.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ యాత్రకు తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.

అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కేంద్ర బలగాలను మోహరించాలని కోరామన్నారు.ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని కోరామని తెలిపారు.

సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??