కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు భద్రత పెంపు

త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది.

ఈ మేరకు రాజీవ్ కుమార్ కు ‘జడ్’ ప్లస్ సెక్యూరిటీ( Z Plus Security )ని కేటాయించింది.

ఎన్నికల నేపథ్యంలో సీఈసీ రాజీవ్ కుమార్( Rajiv Kumar ) కు ముప్పు పొంచి ఉందంటూ భద్రతా సంస్థల నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

""img / కాగా ‘జడ్’ కేటగిరి భద్రత కింద సెంట్రల్ రిజర్స్ పోలీస్ ఫోర్స్ కు చెందిన సుమారు 40 నుంచి 45 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు.

అయితే ఈ నెల 19వ తేదీతో మొదలు కానున్న ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న సంగతి తెలిసిందే.

ఆ విషయంలో మెగా కోడలిని ఫాలో అవుతున్న అక్కినేని కోడలు… ఏమైందంటే?