ప్రాణం మీదకు వచ్చిన మాస్క్ గొడవ.. ఆవేశం అణుచుకోలేని బ్యాంకు సెక్యూరిటీ గార్డు ఎంత పని చేశాడు.. !

ఒక్క క్షణం ఓపిక ఎన్నో సమస్యలను నివారిస్తుంది.ఆవేశం వచ్చినప్పుడు వివేకంతో ఆలోచించాలి, లేదా మౌనంగా ఉండాలని చెబుతారు.

కానీ ఆక్షణం గనుక విచక్షన కోల్పోతే ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.

ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో చోటు చేసుకుంది.

ఇక్కడ పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు ఈ బ్యాంకు కస్టమర్ అయిన ఉత్తరప్రదేశ్ బరేలీ కి చెందిన రైల్వే ఉద్యోగి రాజేష్ తో మాస్కు విషయంలో గొడవకు దిగాడట.

ఈ క్రమంలో రాజేష్ మాస్క్ పెట్టుకుని తిరిగి బ్యాంకులోకి వెళ్లుతున్న సమయంలో ఇప్పుడు లంచ్ టైం అయ్యిందని అడ్దుకున్నాడట.

తన పాస్ బుక్ ఎంట్రీ చేయించుకోని వస్తానని పెద్దగా పని లేదని చెప్పినప్పటికి వినిపించుకోని ఆ సెక్యూరిటీ గార్డ్ అతనితో వాదనకు దిగాడట.

అలా ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఆవేశం ఆపుకోలేని గార్డు అతని కాలిపై తుపాకీతో కాల్చడంతో ఆ కస్టమర్ అక్కడే కుప్పకూలిపోయాడట.

ఇది సరేగానీ ఒకవేళ ప్రాణాలు పోతే దీని ఎవరు బాధ్యులో.మరి ఉద్యోగం చేస్తు ఇంత ఆవేశంగా ప్రవర్తించడం సరికాదని అనుకుంటున్నారట.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై వర్మ సంచలన పోస్ట్.. మెగాబలి అంటూ కామెంట్స్!