అధ్యక్షుడి భద్రతలో వైఫల్యం .. జో బైడెన్ దంపతుల కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు, అమెరికాలో కలకలం

అమెరికా అధ్యక్షుడు( US President ).ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధినేత.

కనుసైగతో ఏ దేశాన్నైనా, ఎవరినైనా శాసించగల పవర్ ఆయన సొంతం.ప్రపంచ గమనాన్ని రెప్పపాటులో మార్చగల నిర్ణయాధికారం అగ్రరాజ్యాధినేత చేతుల్లో వుంటుంది.

అందుకే ఆయనకు ఎక్కడికి వెళ్లినా గౌరవ మర్యాదలు దక్కుతాయి.అమెరికా అధ్యక్షుడంటే ఈ ప్రపంచానికి పెద్దన్న.

ఆయన కాలు బయటపెట్టాలంటే మామూలు విషయం కాదు.అధ్యక్షుడు పలనా ప్రాంతానికి పర్యటనకు వెళ్తున్నాడంటే అంతకు కొద్దిరోజుల ముందే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని కంట్రోల్‌లోకి తీసుకుంటాయి.

చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా పటిష్ట భద్రత మధ్య అమెరికా అధ్యక్షుడి పర్యటన సాగుతుంది.

ఇదే స్థాయిలో కాకపోయినా ఆ దేశంలోని చట్టసభ సభ్యులకు వేరే దేశంలో భారీగానే భద్రత వుంటుంది.

ఎందుకంటే వారికి ఏమైనా జరిగితే పెద్దన్న ఆగ్రహానికి గురికావాల్సి వుంటుందన్న భయంతో దాదాపు అన్ని దేశాలు తమ దేశానికి వచ్చిన అమెరికా చట్టసభ సభ్యులను కంటికి రెప్పలా కాపాడుతూనే వుంటాయి.

"""/" / అలాంటిది అమెరికా అధ్యక్షుడికి కల్పించే భద్రతలో సొంత దేశంలోనే వైఫల్యం చోటు చేసుకోవడం కలకలం రేపింది.

జో బైడెన్( Joe Biden ) ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనాన్ని ఓ ప్రైవేట్ కారు ఢీకొట్టింది.

వివరాల్లోకి వెళితే.అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి బైడెన్ స్వగ్రామం డెలావర్‌లో ( Delaware )ఈ ఘటన జరిగింది.

అధ్యక్షుడు ఆయన సతీమణి జిల్ బైడెన్‌లు( Jill Biden ) ఆదివారం రాత్రి డెలావర్‌‌లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు.

అక్కడ భోజనం ముగించుకుని కాన్వాయ్ వద్దకు వస్తుండగా.ఓ గుర్తు తెలియని కారు వేగంగా దూసుకొచ్చి బైడెన్ వాహన శ్రేణిలోని యూఎస్ సీక్రెట్ సర్వీస్‌ వాహనాన్ని ఢీకొట్టి, ఆపై మరో వాహనంపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది.

"""/" / ఆ సమయంలో జిల్ బైడెన్ అధ్యక్షుని వాహనంలో కూర్చొని వుండగా.

జో బైడెన్ కారుకు సమీపంలో వున్నారు.వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అధ్యక్షుడిని వెంటనే కారులోకి తీసుకెళ్లారు.

జో బైడెన్‌కు కేవలం 130 అడుగుల దూరంలోనే ఈ ఘటన జరిగింది.దీనికి కారణమైన వాహనాన్ని భద్రతా సిబ్బంది చుట్టుముట్టి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌లు సురక్షితంగానే వున్నట్లు అధికారులు తెలిపారు.

డ్రైవర్ ఎవరు.అతను ఎందుకిలా చేశాడు.

తదితర వివరాలను యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఆరా తీస్తోంది.

How Modern Technology Shapes The IGaming Experience