సెక్టార్ ఎన్నికల బాధ్యత సెక్టార్ ఆఫీసర్‌లదే – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

సెక్టార్ పరిధిలో ఎన్నికలు స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత సెక్టార్ ఆఫీసర్ లు, సెక్టార్ పోలీస్ ఆఫీసర్ లదేనని కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.

శనివారం ఐడిఓసి ప్రజావాణి హాల్( IDOC Prajavani ) లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెక్టార్ ఆఫీసర్ లు, సెక్టార్ పోలీస్ ఆఫీసర్ ల కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( District Collector Anurag Jayanthi ) మాట్లాడుతూ.

సెక్టార్ పరిధిలో పోలింగ్ స్టేషన్లోని ఎన్నికల అధికారులకు గైడింగ్ ఫోర్స్ సెక్టార్ అధికారులు చేయాల్సి ఉంటుందన్నారు.

అన్ని పోలింగ్ కేంద్రాలు( Polling Stations ) గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఏర్పాటు చేయాలన్నారు.

తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ర్యాంప్ , ఎలక్ట్రిసిటీ , త్రాగునీరు, రన్నింగ్ వాటర్ తో కూడిన మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు ( అస్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్) వివరాలను సెక్టార్ అధికారులు వెంటనే అందించాలని అన్నారు.

ఏమైనా లోటు పాట్లు ఉంటే వాటిని వచ్చే 2 రోజులలో ఏర్పాటు చేయాలన్నారు.

తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తరచూ సెక్టార్ ఆఫీసర్ లు, సెక్టార్ పోలీస్ ఆఫీసర్లు తరచూ సందర్శించాలన్నారు.

తమ సందర్శన షెడ్యూల్ ముందుగానే ప్రజలకు తెలియజేయాలన్నారు.ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీలలో సందర్శిస్తూ.

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలన్నారు.వల్నరెబిలిటీ మ్యాపింగ్ చేసుకుని జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

జీరో వల్నరెబిలిటీ లక్ష్యంగా పని చేయాలన్నారు.అన్ని పోలింగ్ కేంద్రాల లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు .

వారం రోజుల్లో ట్రైనింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి మెటీరియల్ ను అందజేస్తామని చెప్పారు H3 Class=subheader-style జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) మాట్లాడుతూ.

/h3p ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత దేశమని పారదర్శకంగా ఎన్నికల నిర్వహణతో ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది అన్నారు.

సెక్టార్ అధికారులు, పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో తరచుగా పర్యటన చేస్తూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు.

అంతా ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ, క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని సూచించారు.ఎన్నికల కమి షనర్‌ ఆదేశాల మేరకు అధికారులు తమ విధులు నిర్వర్తించాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధు సూదన్ తదితరులు పాల్గొన్నారు.

అన్నా క్యాంటీన్ల వివాదం… అడ్డంగా బుక్ అయిన మెగా హీరో…మామూలు ట్రోల్ కాదుగా!