పల్నాడు జిల్లా మాచర్లలో అమల్లో 144 సెక్షన్

పల్నాడు జిల్లా మాచర్లలో 144 సెక్షన్ అమలులో ఉంది.టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి మాచర్లకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించాయి.కాగా ఇటీవల మాచర్లలో జరిగిన ఘర్షణల్లో ముందస్తు బెయిల్ పై టీడీపీ నేతలు విడుదలైన సంగతి తెలిసిందే.

కోర్టు ఆదేశాల మేరకు మాచర్ల పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతలు సంతకాలు పెట్టాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో మాచర్లలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.