పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

ఈ నెల 23వ తేది నుండి జూన్ 1 తేదీ వరకు ఖమ్మం జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 9 గంటలకు నుండి మధ్యాహ్నం 1గంట వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా ఖమ్మం పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు.

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో మొత్తం 104 పరీక్షా కేంద్రాల వద్ద ఈ అంక్షాలు అమలులో వుంటాయని తెలిపారు.

అదేవిధంగా పరీక్ష నిర్వహించబడే పరీక్షా కేంద్రాలకు ఐదు వందల మీటర్ల పరిధిలో గుమికూడటం, సభ, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడం నిషేధమని, పరీక్షా కేంద్రాల్లోని పరిసరాల ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి వేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ అదేశించారు.

ఈ ఉ త్తర్వులను ఏవరైనా అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగతుందని పోలీస్ కమిషనర్ ప్రకటన తెలియజేసారు.

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్