శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీలో వర్గ విభేదాలు
TeluguStop.com
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అధికార పార్టీ వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
చిలమత్తూరులో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే చిలమత్తూరు ఎంపీటీసీ నాగమణి భర్త నాగరాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.వైసీపీలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని మనస్తాపానికి గురై బలవన్మరణానికి యత్నించినట్లు సమాచారం.
వెంటనే గమనించిన పోలీసులు, వైసీపీ నేతలు నాగరాజును అడ్డుకున్నారు.అనంతరం ఎమ్మెల్సీ ఇక్బాల్ కు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వామ్మో, అమ్మాయిలు ఇంత డేంజర్‌గా ఉంటారా.. ప్రియుడికి విషమిచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్.. చివరకు..?