తిరుమల శ్రీవారి విగ్రహ రహస్యాలు ఏమిటో మీకు తెలుసా..?

కలియుగ దైవంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం.చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఉన్న ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది.

ఈ ఆలయ దర్శనార్థం దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుపతికి చేరుకుంటారు.

ఏడుకొండలపై వెలసిన స్వామి వారిని ఏడుకొండలవాడని కూడా పిలుస్తారు.ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు.

అయితే ఈ స్వామివారిని వెంకటేశ్వరుడని, శ్రీహరి అని, వడ్డీ కాసుల వాడు అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు.

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ తిరుపతి ఆలయంలో వెలసిన స్వామి వారి విగ్రహనికి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.

మరి ఆ రహస్యాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.స్వామివారు కొలువై ఉన్న ఈ తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తులో ఉంది.

తిరుమల కొండ ఎప్పుడు శీతలముతో ఉండే ప్రదేశం.కానీ అక్కడ వేంకటేశ్వర స్వామి మూలవిరాట్టు మాత్రం అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది.

స్వామి వారి విగ్రహం ఎల్లప్పుడు 110 డిగ్రీలు ఉండటం ఎంతో ఆశ్చర్యకరం.ప్రతిరోజు తెల్లవారుజామున 4: 30 నిమిషాలకు స్వామివారికి చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు.

అభిషేకం అనంతరం పట్టువస్త్రాలతో స్వామి వారి మూల విరాట్ ను సుతిమెత్తగా తుడుస్తారు.

"""/" / ప్రతి గురువారం అభిషేకానికి ముందు స్వామి వారి నగలు అన్నింటిని తీసేస్తారు.

ఈ నగలు ఎంతో వేడిగా ఉంటాయని అక్కడ పురోహితులు చెబుతున్నారు.దీనికి కారణం స్వామివారి మూలవిరాట్ 110 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటమే.

ఈ ఆలయంలో స్వామి వారికి నైవేద్యంగా ఎన్నో రకాల వంటలను చేసినప్పటికీ, స్వామి వారికి మాత్రం ప్రతి రోజూ ఒక కొత్త కుండలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు.

స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం తప్ప మరి ఏ ఇతర ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించరు.

ఇక స్వామి వారు ధరించే వస్త్రాలు 21 అడుగుల పొడవు ఉండి, ఆరు కేజీల బరువు ఉంటుంది.

ప్రతి శుక్రవారం స్వామివారికి బిల్వదళాలతో పూజ చేస్తారు.శివరాత్రి వంటి పర్వదినాలలో స్వామివారి ఉత్సవమూర్తికి విభూతిని సమర్పించి, తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు.

ధనుష్ కొత్త టార్గెట్ ఏంటి అంటే..?