తెలంగాణలో మరోసారి బీజేపీ అసంతృప్తి నేతల రహస్య భేటీ..!
TeluguStop.com
తెలంగాణలో బీజేపీ అసంతృప్తి నేతలు మరోసారి భేటీ అయ్యారని తెలుస్తోంది.హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ లో కొందరు సీనియర్ నేతలు సమావేశం అయ్యారు.
కాగా ఈ భేటీకి సీనియర్ నేతలతో పాటు ఐదుగురు మాజీ ఎంపీలు హాజరయ్యారు.
బీజేపీలో తాజా పరిణామాలపై ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది.కోర్ కమిటీ సభ్యులుగా ఉన్న తమకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేదని, రాష్ట్ర నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే త్వరలోనే ఢిల్లీకి వెళ్లి పార్టీ అధినాయకత్వాన్ని కలిసే యోచనలో అసంతృప్త నేతలు ఉన్నారని సమాచారం.
క్రిస్మస్ స్టాకింగ్‌లో లాటరీ టికెట్.. ఒక్క రాత్రిలో కోటీశ్వరురాలైంది..!