తన పిల్లల పేర్ల వెనుకున్న రహస్యం చెప్పిన రేణు దేశాయ్..
TeluguStop.com

రేణు దేశాయ్ తెలుగులో పలు సినిమాలు చేసిన ఈ అమ్మడు.పవన్ కల్యాణ్ తో ప్రేమలో పడింది.


ఓ సినిమా చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పెరిగిన పరిచయం ప్రేమగా మారింది.


చివరకు వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత వీరికి ఓ బాబు, పాప పుట్టారు.
కొంత కాలం క్రితమే వీరిద్దరు విడిపోయారు.పిల్లలిద్దరూ తన తల్లిదగ్గరే పెరుగుతున్నారు కూడా.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇద్దరు పిల్లలకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది.
అందులో పిల్లలకు పేర్లు ఎలా పెట్టాం అనే విషయం చెప్పింది.ఇంతకీ వారి పేర్లు ఎలా డిసైడ్ చేశారో ఇప్పుడు చూద్దాం.
పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ మొదటి సంతానంగా అబ్బాయి పుట్టాడు.తన పేరు అకీరా నందన్.
రెండో సంతానంగా అమ్మాయి పుట్టింది.తన పేరు ఆధ్య కాత్యాయిని.
అయితే వీరి పేర్ల వెనుక చాలా కథ ఉన్నట్లు చెప్పింది రేణు దేశాయ్.
అకీరా అంటే తనకు ముందు నుంచే ఇష్టం ఉన్న పేరు అని చెప్పింది.
నందన్ మాత్రం తన తండ్రి పవన్ కల్యాణ్ సూచించినట్లు చెప్పింది.తాను గతంలో అఘోర అనే పుస్తకాన్ని చదివినట్లు చెప్పింది రేణు.
"""/"/ ఇందులో ఆధ్య అనే క్యారెక్టర్ చాలా ఫేమస్ అని చెప్పింది.
అంతేకాకుండా ఆధ్య అంటే ఆదిశక్తి అని చెప్పింది.మహాలక్ష్మి, మహాంకాళి, మహా సరస్వతి కలిస్తే ఆధ్య అని వెల్లడించింది.
అటు దుర్గాదేవి స్తోత్రంలో కాత్యాయిని అని ఉంటుందని.అందుకే ఆ పేరు నచ్చడంతో ఆధ్య, కాత్యాయిని అనే పేరు పెట్టినట్లు చెప్పింది.
కాత్యాయిని అనే పేరును డెలివరీకి రెండు రోజుల ముందు డిసైడ్ చేసినట్లు వెల్లడించింది.
"""/"/
తనకు కోపం వచ్చినప్పుడు.మొదటి పేరును కాకుండా రెండో పేరుతో పిలుస్తానని చెప్తుంది.
నందా అనిపిలిస్తే.అబ్బాయికి, కాత్యాయిని అని పిలిస్తే అమ్మాయి తాను కోపంగా ఉన్నట్లు తెలిసిపోతుందన్నారు.
అందుకే ఆ పేర్లతో పిలిస్తే వెంటనే సెట్ రైట్ అయిపోతారని రేణూ వివరించింది.