ఆర్ఆర్ఆర్ నుండి మరోటి.. ఈసారి ఏమిటో తెలుసా?

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

అయితే కేవలం హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్లు, ఓ థీమ్ సాంగ్‌ను మాత్రమే ఆర్ఆర్ఆర్ యూనిట్ రిలీజ్ చేయడంతో ఈ సినిమా నుండి మరో అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తు్న్నారు.

వినాయక చవితి కానుకగా ఈ సినిమా నుండి ఏదైనా అప్‌డేట్ ఉంటుందని చాలా మంది ఆశించారు.

కానీ వారందరినీ జక్కన్న అండ్ టీమ్ నిరాశకు గురిచేసింది.అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్‌డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆయనకు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది.

వీరిద్దరి మధ్య సాగే ఓ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తు్న్నట్లు తెలుస్తోంది.

వచ్చే వారం లేదా అటుపై వారంలో ఈ పాటను రిలీజ్ చేయాలని ఆర్ఆర్ఆర్ టీమ్ భావిస్తోందట.

ఒకవేళ ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, ఆయనకు జోడీగా ఒలివియా మారిస్ నటిస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, ఎంఎం కీరవాణి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరి ఆర్ఆర్ఆర్ నుండి రెండో పాటగా రాబోతున్న అప్‌డేట్ ఎప్పుడు ఉంటుందా అనేది చూడాలి.

చిరంజీవి, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!