శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్- మిత్ర వింద మూవీస్- 'ఫస్ట్ డే ఫస్ట్ షో' నుండి సెకండ్ సింగల్ విడుదల
TeluguStop.com
ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌లో నిర్మిస్తున్న చిత్రం`ఫస్ట్ డే ఫస్ట్ షో`.
మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.
సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆసక్తికరమైన ప్రమోషన్స్ కంటెంట్ తో క్యూరియాసిటీని పెంచుతోంది.
ఇప్పటికే విడుదల ఫస్ట్ సింగల్, టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
రాధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి సెకండ్ లిరికల్ వీడియో 'నీ నవ్వే' పాటని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం.
హీరో తన ప్రేయసి ప్రేమ ఊహల్లో తేలుతున్న ఈ పాట విన్న వెంటనే ఆకట్టుకుంది.
ఈ పాటకు రాధన్ కంపోజ్ చేసిన ట్యూన్ చాలా యూత్ ఫుల్ గా వుంది.
రామ్ మిరియాల పాడిన ఈ పట హుషారుగా సాగింది.♪♪కొత్తగా ఊపిరందుకుంది ఊపిరి
సూటిగా సాగిపొమ్మని
ఆశగా తెల్లవారుతుంది రాతిరి
నిండుగా రేపు నాదని
నీ నవ్వే నీ చిరునవ్వే
నే కోరే వెన్నెల
ఏదైనా సాధిస్తాలే
తోడుంటే నువ్విలా
సాహసం చేయనా.
నీ కోసం
దించనా నీ కోసం.అందని ఆకాశం♪ ♪
రామజోగయ్య శాస్త్రి పాటకు అందించిన సాహిత్యం మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంది.
లిరికల్ వీడియోలో చూపించిన షూటింగ్ విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి.శ్రీకాంత్ రెడ్డి కూల్ ఫెర్ఫార్మెన్స్, సంచితా బషు క్యూట్ స్మైల్ అలరిస్తున్నాయి.
వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, మాధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
H3 Class=subheader-styleతారాగణం:/h3p శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా.
H3 Class=subheader-styleసాంకేతిక విభాగం/h3p
సమర్పణ: ఏడిద శ్రీరామ్,
కథ: అనుదీప్ కెవి,
నిర్మాత: శ్రీజ ఏడిద,
దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పి,
స్క్రీన్ ప్లే: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్, కళ్యాణ్,
డైలాగ్స్: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్,
సంగీతం: రాధన్,
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి,
ఎడిటర్: మాధవ్,
పీఆర్వో : వంశీ-శేఖర్.
Grand Vegas: A Beginner’s Guide To The Mobile Experience And Banking In Canada