రెండోసారి కరోనా సోకితే ప్రాణాలకే ముప్పా.?

2019 సంవత్సరం డిసెంబర్ నెలలో చైనా దేశంలోని వుహాన్ నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి ప్రభావం ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా, భారత్, బ్రెజిల్ పై ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 60 శాతం కేసులు ఈ మూడు దేశాల్లోనే నమోదవుతూ ఉండటం గమనార్హం.

కరోనా సోకితే కోలుకున్న తరువాత అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని కోలుకున్న వాళ్లు చెబుతున్నారు.

అయితే పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ సోకిన వాళ్లకే మళ్లీ సోకుతోంది.మొదట్లో రెండోసారి కరోనా సోకితే అంత ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు చెప్పినా ఐసీజీఈబీ అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రెండోసారి కరోనా నిర్ధారణ అయిన వాళ్లలో వైరస్ లోడ్ ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ముంబైలో కరోనా నిర్ధారణ అయిన నలుగురిని పరిశీలించి ఈ విషయాలను తెలిపారు.ది లాన్సెట్‌ మెడికల్ జర్నల్‌లో శాస్త్రవేత్తలు రెండోసారి కరోనా నిర్ధారణ అయిన వాళ్లలో జన్యు పరిణామ క్రమాన్ని అధ్యయనం చేసి వెల్లడైన ఫలితాలను ప్రచురించారు.

ఢిల్లీలోని ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనిటిక్స్ ఇంజనీరింగ్ అండ్ బయోలజీ, జీనోమిక్స్‌ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ, నాయర్, హిందూ కాలేజీలు ఈ అధ్యయనం చేశాయి.

వారి జీనోమ్స్ లో 39 సార్లు ఉత్పరివర్తనాలు చోటు చేసుకున్నాయని తేలింది.రెండోసారి సోకిన వాళ్లలో లక్షణాలు ఎక్కువగా కనిపించాయని.

జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా మాత్రమే గుర్తించవచ్చని.ఆర్టీపీసీఆర్ పరీక్ష కూడా వైరస్ ను గుర్తించలేదని చెప్పారు.

రెండోసారి కరోనా సోకిన వాళ్ల ప్రాణాలకే ముప్పు అని తెలిపారు.రెండోసారి కరోనా సోకితే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో మార్గం లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ట్రూడోకు షాక్.. ఈసారి మత సమూహాల చూపు కన్జర్వేటివ్‌ల వైపే, కెనడాలో సంచలన సర్వే