తెలంగాణలో రెండో రోజు రాహుల్ గాంధీ పర్యటన
TeluguStop.com
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి, జడ్చర్ల మరియు షాద్ నగర్ లలో రాహుల్ పర్యటించనున్నారు.
రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది.
నిన్న జరిగిన కొల్లాపూర్ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు మధ్యాహ్నం వరకు నోవాటెల్ హోటల్ లోనే రాహుల్ గాంధీ ఉండనున్నారు.ఈ క్రమంలోనే పార్టీలోని ముఖ్యనేతలతో సమావేశం కానున్న ఆయన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదేవిధంగా పెండింగ్ సీట్లతో పాటు కమ్యూనిస్టుల సీట్లపై కూడా నేతలతో చర్చించనున్నారు.దీంతో కమ్యూనిస్టుల సీట్ల వ్యవహారంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
చిరంజీవి సినిమాను ఆ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్న శ్రీకాంత్ ఓదెల…మరి ఇది వర్కౌట్ అవుతుందా..?