తెలంగాణ యూనివర్సిటీలో రెండో రోజు సోదాలు

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ మరియు విజిలెన్స్ ఎన్‎ఫోర్స్‎మెంట్ అధికారుల దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి.

అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నిన్న సుమారు ఎనిమిది గంటల పాటు అధికారులు దాడులు నిర్వహించారు.

ఇందులో భాగంగా కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ, విజిలెన్స్ అధికారులు ఇంఛార్జ్ రిజిస్ట్రార్ ను ప్రశ్నించారు.

కాగా ఇవాళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే యూనివర్సిటీలో నిధులు దుర్వినియోగం జరగడంతో పాటు అక్రమ నియామకాలు జరిగాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.

పుష్ప 2 స్టోరీ ఇదేనా..? పుష్ప క్యారక్టర్ కి రానా కి మధ్య సంబంధం ఏంటి..?