గజ గజ వణికిపోతున్న తెలంగాణ ప్రజలు..??

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వణికిపోతున్నారు.కరోనా కారణంగా మొన్నటి వరకు చికిత్స చేయించుకోవడానికి అనేక ముప్పు తిప్పలు పడ్డ ప్రజలు ఇప్పుడు సీజనల్ జ్వరాలతో అల్లాడిపోతున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల బాధితులు భారీస్థాయిలో హాస్పిటల్ కి చేరుకుంటున్నారు.

వేలసంఖ్యలో జ్వరాల కేసులు సీజనల్ డిసిజ్ లు బయట పడుతున్నాయి.ఇదే విషయాన్ని వైద్య శాఖ అధికారులు కూడా ధ్రువీకరించారు.

మరోపక్క వైద్యులు ఇవన్నీ ఫ్లూ కేసులు.భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

కానీ అస్తమానం జ్వరం వస్తుంది అంటే ఖచ్చితంగా కరోనా పరీక్ష చేయించుకోండి అని అన్నారు.

పట్టణాల్లో గ్రామాల్లో ఉండే ప్రజలు ఎప్పటికప్పుడు పరిసరాల్లో పరిశుభ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలిపారు.

ఏది ఏమైనా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతూ ఉన్న క్రమంలో మరోపక్క కేంద్రం థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో జ్వరాల కేసులు అధికమవడం తో తెలంగాణ వాసులు గజగజ వణికిపోతున్నారు.

చంద్రబాబు పేరున ఒక డ్రీమ్ లేదు.. స్కీమ్ లేదు..: మంత్రి బొత్స