యాపిల్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. ఇక కింద పడినా ఏం కాదు..

చాలామంది ఐఫోన్లను ఉపయోగిస్తూ ఉంటారు.ఈ రోజుల్లో చాలామంది యాపిల్ ఐఫోన్లను( Apple IPhones ) వాడుతున్నారు.

ఎక్కువగా రిచ్‌గా ఉండటంతో పాటు చాలా స్ట్రైలిష్‌గా ఉంటుంది.అలాగే ఐఫోన్‌కు భద్రత కూడా ఎక్కువగా ఉంటుంది.

హ్యాకింగ్ చేయడం లాంటి పనులు చేయడం చాలా కష్టం.అందుకే సెక్యూరిటీ కోసం చాలామంది ఐఫోన్లను కొనుగోలు చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఐఫోన్ యూజర్లకు యాపిల్ గుడ్ న్యూస్ తెలిపింది. """/"/ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు వంటి డివైజ్‌లు గీతలు పడకుండా కొత్త పేటెంట్‌ను పొందింది.

స్పేషియల్ కాంపోజిట్స్( Spatial Composites ) అనే ఈ పేటెంట్ హక్కును సొంతం చేసుకుంది.

జూన్ 13న యూఎస్ పేటెంట్, ట్రేడ్‌మార్క్ కార్యాలయం నుంచి ఈ పేటెంట్‌ను దక్కించుకుంది.

దీంతో ఐఫోన్లను యాపిల్ మరింత మన్నికగా స్క్రాచ్ రెసిస్టెన్స్( Scratch Resistance ) ,విద్యుదయస్కాంత కవచాన్ని కలిగి ఉండేలా తయారుచేయనున్నారు.

ప్రస్తుతం యాపిల్ ఐఫోన్లు మెటల్ లేదా ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో లేదా గాజుతో తయారుచేయబడిన ప్యానెల్‌లను కలిగి ఉన్నాయి.

"""/"/ ప్రస్తుతం ఉన్న ఐఫోన్లలో తక్కువ స్థాయిలో స్క్రాచ్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉండటం వల్ల కింద పడితే గీతలు కూడా ఎక్కువగా పడుతున్నాయి.

అయితే ఫోన్ ప్రమాదవశాత్తూ జారి కింద పడినా దెబ్బతినకుండా, ఎలాంటి గీతలు ఫోన్( Phone Scartches ) మీద పడకుండా ఉండేలా మరింత నాణ్యతతో తయారుచేయాలని యాపిల్ చూస్తోంది.

అందులో భాగంగా డివైజ్‌ల ప్యానెల్‌లను మార్చాలని చూస్తంది.ఈ కొత్త షీల్డ్‌ను 10,100 మైక్రాన్‌ల మధ్య ప్రత్యేకమైన మెటల్, సిరామిక్‌లను కలిపి తయారుచేయనున్నారు.

కవర్ లేదా కేస్ లేకుండా ఫోన్ ఉపయోగించేలా తయారుేచేస్తోంది.త్వరలోనే ఐఫోన్లు కొత్త డిజైన్ తో, కొత్త ఫ్రేమ్‌తో మార్కెట్‌లోకి రానున్నాయి.

ఇవి కింద పడిపోయినా ఏం కాదు.అదనపు రక్షణ ఉండేలా తయారుచేస్తున్నారు.