టేలర్ స్విఫ్ట్‌పై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు.. షాకిచ్చిన మరో పాప్ స్టార్
TeluguStop.com
అమెరికా అధ్యక్ష ఎన్నికలు పాప్ ప్రపంచంపై ప్రభావం చూపుతోంది.డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్‌కు( Kamala Harris ) ప్రఖ్యాత సింగర్, గ్రామీ అవార్డ్ విజేత టేలర్ స్విఫ్ట్( Taylor Swift ) మద్ధతు పలకడంతో అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
మహిళల పునరుత్పత్తి హక్కులు, ఐవీఎఫ్, ఎల్‌జీబీటీక్యూ కేటగిరి హక్కులకు కమలా హారిస్ అండగా నిలుస్తున్నారని టేలర్ స్విఫ్ట్ తెలిపారు.
భారీ ఫ్యాన్ బేస్ కలిగిన ఈమె డెమొక్రాట్‌లకు మద్ధతుగా నిలబడటం ఓటింగ్‌ను ప్రభావితం చేస్తే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఓపీనియన్ పోల్స్‌లోనూ కొంత వరకు ఇది నిజమని తేలింది. """/" /
దీంతో టేలర్ స్విఫ్ట్‌ను రిపబ్లికన్లు టార్గెట్ చేశారు.
స్వయంగా డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఆమెపై దుమ్మెత్తిపోశారు.టేలర్ ఎప్పుడూ డెమొక్రాట్లకు మద్ధతుగా నిలుస్తారని, ఇందుకు ఆమె భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
దీంతో ఆయన తీరుపై మరో స్టార్ సింగర్ స్కూటర్ బ్రాన్( Scooter Braun ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ట్రంప్ మాటల స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశారు.
43 ఏళ్ల బ్రాన్ ఇప్పటికే కమలా హారిస్‌కు మద్ధతు ఇస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
"""/" /
14 సార్లు గ్రామీ అవార్డ్ పొందిన టేలర్ .గతంలో పలుమార్లు డెమొక్రాటిక్ పార్టీకి మద్ధతిచ్చిన చరిత్ర ఉంది.
స్విప్ట్‌కున్న అశేష అభిమాన గణం అమెరికా ఎన్నికల్లో ప్రభావం చూపించగలదని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు.
ఈ జనరేషన్‌లో స్విఫ్ట్ అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు.అందుకే బైడెన్ - ట్రంప్ శిబిరాలు ఆమె మద్ధతును కోరాయి.
2020లో కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు టేలర్ స్వాగతించారు.ఒక మహిళ అమెరికాలో ఇంతటి ఉన్నతమైన రాజకీయ హోదాలో ఉండటం చాలా పెద్ద విషయమని ఆమె తన స్నేహితుల వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
ఎలాన్ మస్క్ వంటి టెక్ దిగ్గజాల నుంచి కార్పోరేట్ ప్రపంచం మొత్తం డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గుచూపుతోంది.
అయితే సిలికాన్ వ్యాలీ, హాలీవుడ్ వర్గాలు కమలా హారిస్‌కు జైకొడుతున్నాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారు కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే!