థ‌ర్డ్‌వేవ్ మీద సంచ‌ల‌న కామెంట్లు చేసిన శాస్త్ర‌వేత్తలు.. ఆ నెల‌ల్లో అత్య‌ధికంగా కేసులు

క‌రోనా ప్ర‌పంచాన్ని ఇంకా భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తూనే ఉంది.ఇక మ‌న దేశంలో ఇప్ప‌టికే రెండు వేవ్‌లు రావ‌డంతో మూడో వేవ్ ఎప్పుడెప్ఉడా అని అంతా భ‌య‌ప‌డిపోతున్నారు.

దీనిపై ఇప్ప‌టికే ఎన్నో రూమ‌ర్లు వ‌స్తున్నాయి.ఆ నెల‌లో ఉంటుంద‌ని లేదు ఈ నెల‌లోనే ఉంటుంద‌ని ఇలా చాలా ర‌కాలుగా రూమ‌ర్లు వ‌చ్చిప‌డుతున్నాయి.

ఇలా రూమ‌ర్ల న‌డుమ‌నే నెల‌లు గ‌డిచిపోతున్నాయి.అయితే ఇప్పుడు వ‌రుస పండుగల సంద‌ర్భంగా మ‌న దేశంలో తాజా పరిస్థితి భ‌యంక‌రంగా మారుతోంది.

మ‌ళ్లీ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరిగిపోతున్నాయి.ఈ క్ర‌మంలో శాస్త్రవేత్తలు తాజాగా థర్డ్ వేవ్ మీద సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

ఇంకా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చేశారు.ప్ర‌ముఖ సైంటిస్టులు అయిన సందీప్ మండల్, అలాగే నిమలన్ అరినమిన్ పతితో పాటుగా బలరాం భార్గవ లాంటి టీమ్ క‌లిసి ఇప్పుడున్న ప‌రిస్థితుల మీద ఓ అధ్యయనాన్ని రిలీజ్ చేశారు.

దీన్ని చూస్తే అంద‌రూ వ‌ణికిపోవాల్సిందే అన్న‌ట్టు ఉంది.ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా మూడో వేవ్ ఉండ‌దని అనుకుంటున్న వారికి ఈ అధ్య‌య‌నం షాక్ ఇస్తోంది.

రాబోయే రోజుల్లో దేశంలో క‌చ్చితంగా క‌రోనా థ‌ర్డ్ వేవ్ విప‌రీతంగా ఉంటుందని వారు హెచ్చరించారు.

"""/"/ అక్బోట‌ర్ నెల నుంచే కేసుల క్ర‌మంగా ఎక్కువ‌గా నమోదు అవుతూ రాబోయే జనవరి నుంచి ఏప్రిల్ నెల‌ల్లో పీక్ స్టేజికి కేసులు పెరిగిపోతాయ‌ని చెబుతున్నారు.

ఆ నెల‌ల్లోనే థ‌ర్డ్ వేవ్ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంద‌ని వెల్ల‌డించారు.ఇప్ప‌టికే దేశఃలో పర్యాటకుల సంఖ్య కార‌ణంగా అలాగే మ‌త ప‌ర‌మైన‌, పండుగ‌ల, రాజ‌కీయ వేడుక‌లకు ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున గుమిగూడుతున్నార‌ని దీని కార‌ణంగా కేసులు పెరిగిపోయి మూడో వేవ్ వ‌స్తుంద‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కేస‌లు పెరుగుతున్న వైనాన్ని చూపించి అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ కోరుతున్నారు.

కాజల్ అగర్వాల్ జీవితాన్ని మార్చేసిన బన్నీ సలహా.. అసలేం జరిగిందంటే?