శాస్త్రవేత్తల హెచ్చరిక.. వ్యాక్సిన్స్ వచ్చినా తనపని తాను చేసుకుంటూ వెళ్తున్న కరోనా.. ?
TeluguStop.com
మానవులకు ప్రశాంతత లేకుండా చేసిన కరోనా ప్రస్తుత పరిస్దితుల్లో కొన్నిచోట్ల తగ్గుముఖం పట్టగా, మరి కొన్ని చోట్ల సెకండ్ వేవ్‌గా వ్యాపిస్తూ ఉంది.
ఇలాంటి దశలో కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని మురిసిపోతున్న వారికి శాస్త్రవేత్తలు హెచ్చరికల మీద హెచ్చరికలు జారిచేస్తున్నారు.
ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి మాత్రమే ఉపయోగిస్తున్నరు.కాగా ఈ వ్యాక్సిన్లు ప్రజలందరికీ అందుబాటులోకి రావడానికి కొన్ని నెలల సమయం పట్టచ్చన్నది ఆరోగ్యశాఖ వారు చెబుతున్న విషయమే.
ఈలోపల ఏమాత్రం వెనకడుగు వేయకుండా కరోనా తన పని తాను చేసుకుంటూ వెళ్తోందట.
వైరస్‌లో వేగంగా కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదీగాక ప్రజలకు వ్యాక్సిన్ వేయడంలో కాస్త ఆలస్యం జరిగితే కొత్త రకాల కరోనా వైరస్‌లు ప్రబలే అవకాశం పెరుగుతుందని వీరు చెబుతున్నారు.
ఇప్పటికే కరోనా కొత్త స్ట్రెయిన్, పాత కొవిడ్-19 కంటే 10 రేట్లు వేగంగా విస్తరిస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అంతేగాక కరోనా వైరస్‌ను మరింత ప్రమాదకరంగా మార్చే మార్పు ఎప్పుడైనా రావచ్చని శాస్త్రవేత్త పార్డిస్ సబేటి తెలిపారు.
అందుకే వీలైనంతగా ఏ మాత్రం జాప్యం చేయకుండా వ్యాక్సిన్లు వేయడమే కాకుండా, కరోనా కట్టడికి తగిన జాగ్రత్తలను పాటించాలని చెబుతున్నారు.
లేదంటే కరోనా వైరస్‌లో చోటు చేసుకుంటోన్న జన్యు మార్పులు కొత్త సమస్యలకు దారి తీసే అవకాశం లేకపోలేదనిహెచ్చరిస్తున్నారు.