ఇదేందయ్యా ఇది: చేప కడుపులో తాబేలును గుర్తించిన శాస్త్రవేత్తలు..!

ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ ప్రభావమో తెలియదు కానీ.మరేదో కారణం చేతనో కానీ ప్రపంచములో అనేక రకాల కొత్త కొత్త జీవాలను మనం రోజు సోషల్ మీడియా పుణ్యమా అంటూ తెలుసుకుంటూ ఉన్నాం.

ఇలా మనం ఎన్నో రకాల జీవ రాశులని మనం తెలుసుకోగలుగుతున్నాము.ఇందులో భాగంగానే కొన్ని వార్తలు వినడానికే అసలు ఇవి నిజమేనా అనిపించేలా కొన్ని వింత వార్తలు ఉంటాయి.

ప్రస్తుతం అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొట్టేస్తుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

అమెరికా దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రం లో బ్రతికి ఉన్న చేప కడుపులో తాబేలు ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఒక పెద్ద నోరు బ్రతికి ఉన్న చేపలో ఏదో కలియతిరుగుతూ ఉన్నట్లు గుర్తించిన కొందరు దానిని ల్యాబ్ కు తీసుకువెళ్లగా అక్కడ బయాలజిస్ట్ పరీక్షలు చేయగా అందులో తాబేలు ను వారు గుర్తించారు.

అలా గుర్తించినవారు చేప కడుపులో తాబేలు సజీవంగానే బ్రతికి ఉన్నట్టుగా వారు నిర్ణయించారు.

ఇందుకు సంబంధించి ఓ రీసెర్చ్ సెంటర్ సంబంధించిన వారు పూర్తి వివరాలను ఫేస్బుక్ ద్వారా షేర్ చేయడం జరిగింది.

ఇందులో వారు కొన్ని రోజుల క్రితం ఓ చెరువులో పెద్ద ఉన్న భాష్ చేపను పట్టుకో వచ్చిన సమయంలో దాన్ని ల్యాబ్ కి తీసుకురాగా వాటిపై పరిశోధనలు చేసిన సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు.

చేపలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయాలనుకున్నవారు ఆ సమయంలో చేప కడుపులో ఏదో కదులుతున్నట్లుగా వారు గుర్తించడంతో దాంతో చేప నోటిని తెరిచి చూడగా అందులో తాబేలు ఉన్నట్లుగా వారు గుర్తించారు.

ఆ తర్వాత అతి జాగ్రత్తగా చేప కడుపులో నుంచి తాబేలు ను సజీవంగా బయటకు తీశారు.

ఇలాంటి సంఘటనలో అస్సలు జరగవని ఆ పరిశోధకులు తెలిపారు.అలా చేప నోటి నుంచి బయటికి తీసిన తాబేలును దగ్గర్లోని ఓ నీటి ప్రవాహం దగ్గర విడిచిపెట్టారు వారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించి వార్త తెగ వైరల్ గా మారింది.

చిరంజీవి, బాలయ్యలపై విమర్శలు చేసిన ప్రముఖ రచయిత్రి.. అసలేం జరిగిందంటే?