ప్రజల కోసం కోట్ల రూపాయల పేటెంట్ హక్కులు వదులుకున్న మహానుభావులు ఎవరో తెలుసా?

కరోనా కల్లోలం ఆపాలంటే దేశంలో 60 శాతం మందికి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.

కానీ ఇప్పుడు భారత్ లో తయారు అవుతున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు జనాభాకు సరిపడ ఉత్పత్తి కావడం లేదు.

ఈ రెండు కంపెనీలు తయారు చేసే వ్యాక్సిన్లు ఇవ్వాలి అంటే రెండేండ్లు ఆగాల్సి ఉంటుంది.

కానీ అంత సమయం లేదు.అందుకే భారత ప్రభుత్వం ఈ కంపెనీల నుంచి పేటెంట్ రైట్స్ తీసుకుని.

వ్యాక్సిన్ భారీగా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఇతర సంస్థలకు ఇస్తే ప్రజలకు వ్యాక్సిన్ అందించడం సులభం అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి.

విపత్తుల సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుంది.అయితే ప్రజా శ్రేయస్సు కోసం గతంలో ఎంతో మంది పరిశోధకులు వేల కోట్లు అందించే వ్యాక్సిన్ల పేటెంట్లు వదులుకున్నారు.

ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం.h3 Class=subheader-styleపోలియో వ్యాక్సిన్/h3p """/"/ 20వ శతాబ్దంలో పిల్లలను పీడించిన రోగం పోలియో.

దీని నుంచి చిన్నారులను కాపాడటానిక 1952లో అమెరికా వైరాలజిస్టు జోనాల్ సాల్క్ టీకా రూపొందించాడు.

నిర్జీవం చేయబడిన వైరస్ ను టీకా రూపంలో ఇవ్వడంతో శరీరంలో యాంటీబాడీలు ఏర్పడేలా చేశారు.

అవి సదరు వ్యక్తులను జీవితాంతం ఆ రోగం రాకుండా కాపాడుతాయి.ఈ టీకా ద్వారా వేల కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా వదులుకున్నారు సాల్క్.

H3 Class=subheader-styleఇన్సులిన్/h3p """/"/ మధుమేహం నుంచి జనాలను కాపాడేందుకు ఇన్సులిన్ కనిపెట్టారు కెనడాకు చెందిన ఫ్రెడరిక్ బాంటింగ్, జేమ్స్ కోలిప్, చార్లెస్ బెస్ట్ కలిసి 1923లో కనిపెట్టారు.

వారు కనిపెట్టిన ఈటీకా మూలగా ఎంతో మంది డయాబెటిస్ రోగుల ప్రాణాలు కాపాడబడ్డాయి.

కానీ జనల మేలు కోసం ఓకే ఒక డాలరుకు పేటెంట్ రైట్స్ ఇచ్చారు.

H3 Class=subheader-styleసీటు బెల్ట్/h3p """/"/ జనం కోసం పేటెంట్ వదులుకున్న మరో గొప్ప వ్యక్తి నీల్స్ బోలిన్.

ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడే సీటు బెల్టును ఈయన రూపొందించారు.స్వీడన్ కు చెందిన ఈ సైంటిస్ట్ ఈ సీటు బెల్టు ద్వారా కోట్ల రూపాయలు పొందే అవకాశం ఉన్నా తీసుకోలేదు.

లిక్విడ్ నైట్రోజన్ అంటే ఏమిటి? దీన్ని ఎందు కోసం ఉపయోగిస్తారో తెలుసా..?